LOADING...
Papam Prathap Trailer: 'పాపం ప్రతాప్' ట్రైలర్ సెన్సేషన్.. తిరువీర్ మరో హిట్‌కు రెడీ!
'పాపం ప్రతాప్' ట్రైలర్ సెన్సేషన్.. తిరువీర్ మరో హిట్‌కు రెడీ!

Papam Prathap Trailer: 'పాపం ప్రతాప్' ట్రైలర్ సెన్సేషన్.. తిరువీర్ మరో హిట్‌కు రెడీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో తిరువీర్ మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'మసూద', 'పరేషాన్' వంటి చిత్రాలతో నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన ఇప్పుడు 'పాపం ప్రతాప్' (Papam Pratap) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ హైప్‌ను సృష్టిస్తోంది. ఒక సాధారణ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే వింత పరిస్థితులు, వాటి వల్ల అతడు పడే కష్టాలు, ఆ సమస్యల నుంచి ఎలా బయటపడతాడు అన్న అంశాలను వినోదాత్మక గూఢచారి తరహాలో చిత్రీకరించినట్లు ట్రైలర్ సూచిస్తోంది. ఎస్‌.పీ దుర్గ నరేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

వివరాలు

హీరోయిన్ గా పాయల్ రాధాకృష్ణ

అందులో కనిపించిన విజువల్స్, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు సరైన మూడ్‌ను తీసుకువచ్చాయి. హీరో ప్రతాప్ ఎదుర్కొనే సమస్యలు నవ్వులు పూయించడమే కాకుండా, కథలో బలమైన భావోద్వేగాన్ని కూడా ప్రతిబింబిస్తాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆమెతో తిరువీర్ కెమిస్ట్రీ కొత్తగా అనిపించనుంది. ఏ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాలు సాధించిన తిరువీర్ గత చిత్రాల మాదిరిగానే 'పాపం ప్రతాప్' కూడా విజయవంతం అవుతుందని ట్రేడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement