Page Loader
Nandamuri Balakrishna: బాలయ్య సో స్పెషల్ అందుకే 'పద్మవిభిషణుడయ్యాడు'..!
బాలయ్య సో స్పెషల్ అందుకే 'పద్మవిభిషణుడయ్యాడు'..!

Nandamuri Balakrishna: బాలయ్య సో స్పెషల్ అందుకే 'పద్మవిభిషణుడయ్యాడు'..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
07:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.రామారావు) తనయుడిగా సినీరంగంలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ (Balakrishna), తన తండ్రి తరహాలోనే ప్రస్థానం కొనసాగిస్తూ నటుడిగా విశేషమైన ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేశారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ వంటి అన్ని జానర్లలోనూ నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన అగ్ర నటుడు ఆయన. క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా ఎంతోమందికి సహాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు 'పద్మభూషణ్‌' (Padma Bhushan) పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది.

వివరాలు 

నటుడిగా బాలకృష్ణ.. 

బాలనటుడిగా తండ్రి ప్రోత్సాహంతో "తాతమ్మ కల" సినిమాతో 1974లో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ, "అక్బర్ సలీం అనార్కలి" చిత్రంతో కథానాయకుడిగా స్థిరపడ్డారు. అనంతరం ఎన్నో సాంఘిక, పౌరాణిక, జానపద, ఫ్యాక్షన్, యాక్షన్ చిత్రాల్లో నటించారు. పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలకు సరిపోయే ఆకృతి బాలకృష్ణది. "శ్రీకృష్ణార్జున విజయం" చిత్రంలో శ్రీకృష్ణుడిగా, అర్జునుడిగా మెప్పించడమే కాకుండా, "ఆదిత్య 369" లో శ్రీకృష్ణదేవరాయలుగా నటించి తన ప్రతిభను చాటుకున్నారు. "భైరవద్వీపం" వంటి జానపద చిత్రాలకు ఆయననే హీరోగా ఎన్నుకోవడం సింగీతం శ్రీనివాసరావుకు మాత్రమే సాధ్యమైంది. అదే విధంగా "సమరసింహారెడ్డి" వంటి చిత్రాలతో ఫ్యాక్షన్ జానర్‌ను తెలుగు తెరపై నూతనంగా పరిచయం చేశారు.

వివరాలు 

రాజకీయ నాయకుడిగా బాలకృష్ణ 

65 ఏళ్ల వయసులో కూడా "అఖండ", "భగవంత్ కేసరి", "డాకు మహరాజ్" వంటి యాక్షన్ చిత్రాలతో యువతను ఆకట్టుకోవడం సాధారణ విషయం కాదు. 2014, 2019, 2024 ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించిన బాలకృష్ణ, వైసీపీ వేవ్‌ను కూడా ఎదుర్కొని తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రజలతో కలసిమెలసి ఉండే నాయకుడిగా ఆయన మంచి పేరు సంపాదించారు. కేబినెట్ మంత్రి అయ్యే అర్హతలున్నప్పటికీ, ఆయన ఇంతవరకు ఆ పదవి చేపట్టలేదు.

వివరాలు 

టీవీ హోస్ట్‌గా బాలకృష్ణ 

టీవీ షో "అన్ స్టాపబుల్" హోస్ట్‌గా బాలకృష్ణ పెద్ద సక్సెస్ సాధించారు. ఎన్ని సీజన్లు మారినా ఈ ప్రోగ్రాం క్రేజ్ తగ్గలేదు. నేటి తరం ఓటీటీ ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యారు. ఆహా ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆయన కేర్లెస్ యాటిట్యూడ్, ప్లే ఫుల్ నేచర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బసవతారకం ట్రస్ట్ చైర్మన్‌గా తల్లి పేరుతో నడుస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ, పేదలకు కూడా అందుబాటులో ఉండేలా ఒక సమగ్ర వైద్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీ పథకాలకు ముందే ఆయన వైద్య సేవలు అందించడంలో ముందంజలో ఉన్నారు.