
ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్: స్పందించిన బాహుబలి స్టార్
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గురువారం సాయంత్రం ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్లో ఒక వీడియో దర్శనమిచ్చింది.
అన్ లక్కీ హ్యూమన్స్ అనే పేరుతో ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్లో వీడియో రావడంతో అభిమానులు అందరూ షాకయ్యారు. వెంటనే ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని నిశ్చయానికి వచ్చేసారు.
ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని పోస్టులు పెట్టారు. ఈ విషయమై ప్రభాస్ కూడా స్పందించారు. తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, సమస్యను పరిష్కరిస్తున్నారని ప్రభాస్ తెలియజేసారు.
Details
సోషల్ మీడియాను ఎక్కువగా వాడని ప్రభాస్
ప్రస్తుతం ప్రభాస్ అకౌంట్ సేఫ్ గానే ఉంది. హ్యాక్ అయిన తర్వాత పోస్ట్ కాబడిన వీడియోను డిలీట్ చేసారు.
సాధారణ పౌరుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ప్రభాస్ లాంటి స్టార్ అకౌంట్ హ్యాక్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సొషల్ మీడియాలో ప్రభాస్ యాక్టివ్ గా ఉండడు. తన సినిమాల అప్డేట్లు, పండగలకు సంబంధించిన శుభాకాంక్షలు తప్ప మరే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకునే అలవాటు ప్రభాస్ కు లేదు.
ఫేస్ బుక్ లో ప్రభాస్ ను 24మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.