
ఆహా: అన్ స్టాపబుల్ షోలో పవన్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేది ఆరోజే
ఈ వార్తాకథనం ఏంటి
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో దూకుడు చాలా ఎక్కువగా ఉంది. ఈ షో కారణంగా ఆహా సబ్ స్క్రయిబర్స్ గణనీయంగా పెరుగుతున్నారు.
మొదటి సీజన్ పూర్తి చేసుకుని సక్సెస్ ఫుల్ గా రెండవ సీజన్ ని రన్ చేస్తోంది ఆహా. ఈ రెండవ సీజన్ లో అనేక సర్ప్రైజెస్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 1 రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ప్రభాస్ ఎపిసోడ్ లోంచి రెండవ పార్ట్ కూడా రిలీజ్ కి రెడీగా ఉంది.
జనవరి6వ తేదీన సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుంది. మొదటి పార్ట్ రిలీజైనపుడు ఆహా సర్వర్ క్రాష్ అయ్యింది. సెకండ్ పార్ట్ రిలీజ్ టైమ్ లో అలా జరగకూడదని జాగ్రత్తలు తీసుకుంటుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జనవరి నెలలో ఆహా ఎపిసోడ్స్ టైం టేబుల్
#UnstoppableWithNBKS2 upcoming episodes !!#Balakrishna #Prabhas #Gopichand #PawanKalyan #ShruthiHassan #Thaman #GopichandMalineni pic.twitter.com/Sq1MaxO5sh
— Tollywood Updates (@TollywoodTU) January 3, 2023
అన్ స్టాపబుల్
పవన్ ఎపిసోడ్ వచ్చేది అప్పుడే
ప్రభాస్ తర్వాత అందరి ఎదురుచూపులు పవన్ కళ్యాణ్ కోసమే ఉన్నాయి. కానీ మధ్యలో అదిరిపోయే మరో ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది అన్ స్టాపబుల్.
వీరసింహారెడ్డి సినిమాపై స్పెషల్ ఎపిసోడ్ ఉండనుందని అందరూ అనుకుంటున్నారు. సినిమా విడుదలైన తర్వాతి రోజు జనవరి 13వ తేదీన ఈ స్పెషల్ ఎపిసోడ్ ఉండనుందని సమాచారం.
బాలకృష్ణ హీరోగా చేస్తున్న ఈ సినిమాపై స్పెషల్ ఎపిసోడ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో డైరెక్టర్ సహా హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే పవన్ ఎపిసోడ్ ని నెలాఖరులో ప్రసారం చేస్తారట. జనవరి 27వ తేదీ రోజున పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవనుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.