Page Loader
Pawan Kalyan: ఆపద్భాందవుడిగా పవన్ కళ్యాణ్‌.. పాకీజాకు రూ.2 లక్షల ఆర్థిక సాయం!
ఆపద్భాందవుడిగా పవన్ కళ్యాణ్‌.. పాకీజాకు రూ.2 లక్షల ఆర్థిక సాయం!

Pawan Kalyan: ఆపద్భాందవుడిగా పవన్ కళ్యాణ్‌.. పాకీజాకు రూ.2 లక్షల ఆర్థిక సాయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 01, 2025
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్థిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ నటి వాసుకికి (పాకీజా) ఆపద్భాందవుడిగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆమె పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ సాయం మొత్తాన్ని మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ వాసుకికి స్వయంగా అందజేశారు. పవన్ సాయానికి పాకీజా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Details

కన్నీళ్లు పట్టుకున్న నటి

"చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కేవాణ్ని" అంటూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఆర్థిక స్థితిని నిన్న జనసేన కార్యాలయానికి తెలియజేశానని, వెంటనే స్పందించి ఆపద సమయంలో అండగా నిలిచారని చెప్పారు. తన జీవితాంతం పవన్ కళ్యాణ్ కుటుంబానికి రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. పవన్ చేసిన ఈ సహాయ చర్య పట్ల సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లో కూడా ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది.