Page Loader
Hari Hara Veera Mallu Movie: పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్..  'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సెట్స్‌లోకి పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్..

Hari Hara Veera Mallu Movie: పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్..  'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సెట్స్‌లోకి పవన్ కళ్యాణ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 20, 2024
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, ఆయన సినిమాలను ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన విజయం సాధించిన తర్వాత, డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్, పూర్తి స్థాయిలో రాజకీయాల్లో పాల్గొన్నారు. అయితే, ఆయన మళ్లీ సినిమాల్లో ఎప్పుడు అడుగుపెడతారు అని ఎదురుచూస్తున్నవారికి 'హరిహర వీరమల్లు' టీమ్ క్రేజీ న్యూస్ చెప్పింది.

వివరాలు 

సెప్టెంబర్ 23 నుంచి మళ్లీ చిత్రీకరణ ప్రారంభం 

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రాలలో 'హరిహర వీరమల్లు' ఒకటి. చారిత్రక కథతో రూపొందుతున్న ఈ సినిమాకు ఏయం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్, షూటింగ్ కోసం సమయం కేటాయిస్తానని చెప్పడంతో, చిత్ర బృందం కొత్త షెడ్యూల్ ప్రారంభించడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 23 నుంచి విజయవాడలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

వివరాలు 

పవన్ కల్యాణ్‌పై హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్ 

'హరిహర వీరమల్లు' కోసం హాలీవుడ్ టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశం రూపొందించనున్నారు. నిక్ పావెల్ గతంలో 'బ్రేవ్‌హార్ట్', 'గ్లాడియేటర్', 'ది లాస్ట్ సమురాయ్' వంటి హాలీవుడ్ సినిమాలకు పని చేశారు. ఈ సీక్వెన్స్‌లో 400 మందితో పాటు పెద్ద సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లు పాల్గొంటారు. పవన్ కల్యాణ్ కూడా ఈ యుద్ధ సన్నివేశాల్లో పాల్గొంటారని సమాచారం.

వివరాలు 

విజయవాడ షెడ్యూల్‌తో చివరి దశ చిత్రీకరణ 

నాజర్, రఘుబాబు, సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప తదితర నటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుంది. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం, తోట తరణి కళా దర్శకత్వం, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వరలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.