LOADING...
OG: పవన్ పుట్టినరోజు స్పెష‌ల్.. OG మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల..

OG: పవన్ పుట్టినరోజు స్పెష‌ల్.. OG మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న చిత్రం OG. ఈచిత్రానికి సుజిత్ దర్శకత్వం అందిస్తున్నారు.హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపిస్తున్నారు.డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంగీతాన్ని థమ‌న్ అందిస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడాయి. సినిమా సెప్టెంబ‌ర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఇదే సందర్భంగా,చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను వేగంగా జరుపుతోంది.ఇక నేడు(సెప్టెంబ‌ర్ 2)ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికలలో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.ప‌వ‌న్ బర్త్‌డే సందర్భగా,ఆయన నటిస్తున్న OG మూవీ నుంచి కొన్ని గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈగ్లింప్స్‌ ప్రేక్షకుల మనసులను గెలుచుకునేలా,సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్