
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఇక అభిమానుల ఆసక్తికి తెరపడే వేళ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరిహర వీరమల్లు'కు సంబంధించిన తాజా అప్‌డేట్ బయటకొచ్చింది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను జూలై 3వ తేదీ ఉదయం 11.10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ట్రైలర్‌ను పవన్ కళ్యాణ్ స్వయంగా వీక్షించిన వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. పవన్ చూసి ఎంతో ఎంజాయ్ చేసిన ఆ వీడియో చివర్లో దర్శకుడిని హత్తుకుని 'చాలా కష్టపడ్డావ్' అంటూ ఆయనను అభినందించడం హృదయాన్ని తాకేలా ఉంది.
Details
త్రివిక్రమ్ కలిసి ట్రైలర్ ను చూసిన పవన్ కళ్యాణ్
'తుపాను వెనుక ఉండే శక్తి ఇదే.. ట్రైలర్ చూసిన తర్వాత పవన్ కల్యాణ్ కూడా తన ఎగ్జయిట్మెంట్‌ను అదుపులో ఉంచలేకపోయారని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ ట్రైలర్‌ను పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు త్రివిక్రమ్‌తో కలిసి వీక్షించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తొలుత దర్శకుడు క్రిష్ తెరకెక్కించగా, తర్వాత నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. పవన్ ఇందులో ఒక శక్తివంతమైన చారిత్రక యోధుడిగా నటిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి స్టార్ నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం 'హరి హర వీరమల్లు: పార్ట్ 1 - స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో విడుదల కానుంది.