రెండు భాగాలుగా రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ ఓజీ
బాహుబలి సినిమా నుండి మొదలైన రెండు భాగాల పర్వం ఇప్పట్లో ఆగేలా లేదు. పాన్ ఇండియా అనగానే ప్రతీ ఒక్కరూ రెండు భాగాలుగా తమ సినిమాలను తీసుకొస్తున్నారు. తాజాగా రెండు భాగాల సినిమాల లిస్ట్ లో పవన్ కళ్యాణ్ చేరబోతున్నట్లు వినిపిస్తోంది. సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నారని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు కూడా. ఐతే ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని చిత్రబృందం అనుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం క్లైమాక్స్ ఎపిసోడ్ అదిరిపోయేలా ఉంటుందని, దాంతో రెండో భాగం మీద ఆసక్తి పెరుగుతుందని అనుకుంటున్నారట.
దసరా కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ
మొదటి భాగాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండవ భాగాన్ని 2024లో తీసుకొస్తారట. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలు నిజం కావాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందని వాళ్ళు ఆశిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తే దర్శకుడు సుజిత్ కి మంచి అవకాశం లభించినట్టే. సాహో డిజాస్టర్ అయిన 4సంవత్సరాల తర్వాత పవన్ తో చేస్తున్నాడు కాబట్టి రెండో భాగంతో మరో మంచి అవకాశం దొరికినట్టే. డీవీవీ దానయ్య నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నట్లు వినిపించింది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియలేదు.