LOADING...
PEDDI : 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్.. జూన్ నెలాఖరున థియేటర్లలోకి!
'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్.. జూన్ నెలాఖరున థియేటర్లలోకి!

PEDDI : 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్.. జూన్ నెలాఖరున థియేటర్లలోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' విడుదల తేదీపై స్పష్టత దాదాపు వచ్చేసింది. కొద్దిరోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో విస్తృత చర్చ కొనసాగుతోంది. మొదటగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు . అయితే షూటింగ్ పనులు మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో విడుదలను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో కొత్త రిలీజ్ డేట్‌పై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో జూన్ 4 లేదా జూన్ 25 తేదీల్లో సినిమా విడుదల కావచ్చని వార్తలొచ్చాయి.

వివరాలు

స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేయనున్న శ్రుతి హాసన్

చివరికి చిత్ర యూనిట్ జూన్ 25ను ఫైనల్ డేట్‌గా లాక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమాలో స్పెషల్ సాంగ్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి బాలీవుడ్ నటి శ్రుతి హాసన్ స్టెప్పులేస్తున్నట్లు సమాచారం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ అందిస్తున్నారు.

వివరాలు

సంగీతాన్ని అందించనున్న రెహమాన్

ఆయన ఇచ్చిన పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు షూటింగ్‌లో ఉన్న స్పెషల్ సాంగ్ మరింత మాస్‌గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. 'పెద్ది' రిలీజ్ డేట్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారన్నదే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Advertisement