Peddi: మరోసారి 'పెద్ది' వాయిదా.. అధికారికంగా ప్రకటించిన టీం
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం భారీ అంచనాలు రేకెత్తిస్తున్న చిత్రాల్లో 'పెద్ది' ఒకటి. ఇప్పటికే విడుదలైన చిన్న గ్లింప్స్, పాటలు ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర విడుదల తేదీపై చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల కొంత ఆలస్యమవుతుందని తెలిపింది. వృద్ది సినిమాస్ పతాకంపై బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి చిత్రీకరణ దాదాపు పూర్తయింది. అయితే కొంత భాగం ఇంకా మిగిలి ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. దీంతో విడుదల వాయిదా పడుతుందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఈ పరిస్థితుల్లో తాజాగా చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది.
వివరాలు
అవుట్‌పుట్ చూసిన మేకర్స్ ఫుల్ హ్యాపీ
చిత్రంలోని 'టాకీ' పార్ట్ పూర్తిగా ముగిసిందని, కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని వారు వెల్లడించారు. ఇప్పటికే ఎడిటింగ్ పనులు కూడా ఒక కొలిక్కి రావడంతో, సినిమా అవుట్‌పుట్ చూసిన మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. అయితే, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరికొంత సమయం కేటాయించాలని టీమ్ నిర్ణయించుకుంది. సాంకేతిక నిపుణులు తమ పనిని మరింత మెరుగుపరచి, చిత్రాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వివరాలు
జూన్ నెలలో చిత్రం విడుదల
ముందుగా నిర్ణయించిన ఏప్రిల్ 30 తేదీకి బదులుగా, ఇప్పుడు జూన్ నెలలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఖచ్చితమైన తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. తమపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి సహనానికి తగిన ఫలితాన్ని అందించేలా ఉత్తమమైన కథా విషయంతో వస్తామని చిత్ర బృందం తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సమస్త చేసిన ట్వీట్
We want to give our audience nothing but the best.#PEDDI in cinemas this June ❤🔥 pic.twitter.com/io4MFHfXJy
— PEDDI (@PeddiMovieOffl) April 15, 2026