LOADING...
Peddi Movie: వీకెండ్‌లో మరోసారి దుమ్మురేపిన 'పెద్ది'.. 10 రోజుల్లో ఎంత వసూలైందంటే?
వీకెండ్‌లో మరోసారి దుమ్మురేపిన 'పెద్ది'.. 10 రోజుల్లో ఎంత వసూలైందంటే?

Peddi Movie: వీకెండ్‌లో మరోసారి దుమ్మురేపిన 'పెద్ది'.. 10 రోజుల్లో ఎంత వసూలైందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 14, 2026
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూ భారీ వసూళ్లు సాధిస్తోంది. వీక్‌డేస్‌లో కలెక్షన్లు స్వల్పంగా తగ్గినప్పటికీ, వీకెండ్‌లో మాత్రం సినిమా మళ్లీ జోరు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం (జూన్ 13) కూడా 'పెద్ది'కి భారీ స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. విడుదలైన 10 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.378 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

వివరాలు

రామ్ చరణ్ నటనకు ప్రశంసలు

ఈ లెక్కన శనివారం ఒక్కరోజే సుమారు రూ.12 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కలెక్షన్ల వివరాలను వెల్లడిస్తూ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌, ఉత్తరాది మార్కెట్లలో కూడా 'పెద్ది'కి విశేష స్పందన లభిస్తోంది. ఆదివారం (జూన్ 14) సెలవు దినం కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా, వృద్ధి సినిమాస్ సమర్పణలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. సినిమాలో క్రికెటర్‌గా, రెజ్లర్‌గా, రన్నర్‌గా రామ్ చరణ్ ప్రదర్శించిన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

Advertisement