LOADING...
Sonusood: చంద్రబాబు పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు : సోనుసూద్ 
చంద్రబాబు పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు : సోనుసూద్

Sonusood: చంద్రబాబు పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు : సోనుసూద్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2024
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు సోనుసూద్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటగా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. వంద రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు మార్క్ కనిపిస్తోందని, ఆయన ఆధ్యర్యంలో ప్రజలు సురక్షితంగా, సంతోషంగా ఉన్నారని సోసుసూద్ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి చంద్రబాబు మంచి విజన్ అందించినందుకు గర్వంగా ఉందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.

Details

'త్వరలోనే చంద్రబాబును కలుస్తా' 

త్వరలోనే చంద్రబాబును కలిసి ఆంధ్రప్రదేశ్‌కు తన వంతు సాయం అందిస్తానని ప్రకటించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వంద రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, వరదల సంక్షోభాన్ని ఎదుర్కొన్న విధానం పట్ల సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.