Amaravati: డాకు మహారాజ్, గేమ్ చేంజర్ కు ఏపీ లో అధిక ధరలు.. హైకోర్టులో పిటిషన్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న డాకు మహారాజ్ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
సినిమాకు సంబంధించి విడుదల రోజు తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది.
అదే విధంగా, రెగ్యులర్ షోల కోసం మల్టీప్లెక్స్ టికెట్ ధరపై రూ.135, సింగిల్ స్క్రీన్ టికెట్ ధరపై రూ.110 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
అదేవిధంగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు కూడా బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించడంతో పాటు,రెగ్యులర్ షోల కోసం మల్టీప్లెక్స్‌లకు రూ.135,సింగిల్ స్క్రీన్‌లకు రూ.110 అదనంగా పెంచుకోవడానికి అనుమతినిచ్చింది.
వివరాలు
బెనిఫిట్ షోల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు హాని
అయితే, డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ సినిమాల టికెట్ ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
పిటిషనర్ తన పిటిషన్‌లో, ఇలా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు హాని కలుగుతుందని ఆరోపించారు.
హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ ఘటనలో ఒకరు మరణించిన ఘటనకు సంబంధించిన FIR కాపీని కూడా జత చేశారు. టికెట్ ధరలను నిబంధనలకు విరుద్ధంగా పెంచారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఇచ్చే తీర్పు గురించి నిర్మాతలు, మేకర్స్ లో టెన్షన్ నెలకొంది.