Loading...
Pithapuram Lo Ala Modalaindi Review:'పిఠాపురంలో అలా మొదలైంది' రివ్యూ.. టీనేజ్ ప్రేమ.. తండ్రి-కూతుళ్ల బంధం.. కథ ఎలా సాగిందంటే?
'పిఠాపురంలో అలా మొదలైంది' రివ్యూ.. టీనేజ్ ప్రేమ.. తండ్రి-కూతుళ్ల బంధం.. కథ ఎలా సాగిందంటే?

Pithapuram Lo Ala Modalaindi Review:'పిఠాపురంలో అలా మొదలైంది' రివ్యూ.. టీనేజ్ ప్రేమ.. తండ్రి-కూతుళ్ల బంధం.. కథ ఎలా సాగిందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'పిఠాపురంలో అలా మొదలైంది'. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా బ్యానర్స్‌పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్ చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలకు ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేశారు.

వివరాలు

కథ విషయానికొస్తే..

పిఠాపురం సమీపంలోని ఓ గ్రామంలో బాగా డబ్బున్న వ్యక్తి బంగారయ్య (పృథ్వీ), స్కూల్ టీచర్ విశ్వనాథం (కేదార్ శంకర్), ఆ గ్రామ ప్రెసిడెంట్ వీర రాఘవ (రాజేంద్రప్రసాద్) ముగ్గురూ స్నేహితులు.

వీరి ముగ్గురి కూతుళ్లు గీత (రెహానా), కీర్తన (శ్రీలు), అంజని (ప్రత్యూష) కూడా మంచి స్నేహితులు. బంగారయ్య తన కూతురికి ఇష్టమొచ్చినట్లు డబ్బులు ఇస్తూ ఏం చేయాలనుకుంటే అది చేసుకోమంటుంటాడు.

మరోవైపు విశ్వనాథం మాత్రం కూతురికి 95 మార్కులు వచ్చినా వంద ఎందుకు రాలేదని తిడుతుంటాడు.

వీర రాఘవ మాత్రం తన కూతురితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. స్కూల్ చదువు పూర్తయిన తర్వాత ఈ ముగ్గురు అమ్మాయిలు పిఠాపురంలోని ఓ కాలేజీలో ఇంటర్‌లో చేరతారు. ఆ తర్వాత డిగ్రీ చదువుతారు.

వివరాలు

ఇంటి నుంచి వెళ్లిపోతే ఏమౌతుంది

కాలేజీలో కొత్త పరిచయాలు ఏర్పడటంతో ముగ్గురూ ముగ్గురు అబ్బాయిలను ప్రేమిస్తారు. గీత ఓ అబ్బాయితో లేచిపోతుంది. కీర్తన మాత్రం ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుంది.

అయితే ఆమెను చూసిన విశ్వనాథం.. 'నువ్వు చచ్చిపోయావు' అంటూ ఇంటి నుంచి పంపించేస్తాడు. ఈ రెండు సంఘటనలు జరిగిన తర్వాత అంజని తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలా? వద్దా? అని ఆలోచిస్తుంది.

మరి ఇంట్లో వాళ్లను కాదని ప్రేమ కోసం వెళ్లిపోయిన గీత, కీర్తన జీవితాలు ఎలా మారాయి? అంజని ప్రేమకు ఆమె కుటుంబం ఒప్పుకుందా? గీత, కీర్తన చేసిన పనులకు వారి తల్లిదండ్రులు ఏం చేశారు? చదువుకునే వయసులో ప్రేమ పేరుతో తల్లిదండ్రులను పట్టించుకోకుండా వెళ్లిపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి?

ADVERTISEMENT

వివరాలు

సినిమా విశ్లేషణ..

గతంలో 'ప్రేయసి రావే', 'చెప్పాలని ఉంది', 'ఆలస్యం అమృతం' వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు చంద్ర మహేష్ చాలా గ్యాప్ తర్వాత తన పేరును మహేష్ చంద్రగా మార్చుకుని పిఠాపురంలో అలా మొదలైంది' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

పైగా పవన్ కళ్యాణ్ కారణంగా 'పిఠాపురం' అనే టైటిల్‌కు ప్రత్యేకమైన క్రేజ్ రావడంతో ఈ సినిమాపై కొంత ఆసక్తి ఏర్పడింది. అయితే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా చివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఫస్ట్ హాఫ్‌లో ఓ అమ్మాయి లేచిపోయే సన్నివేశంతో కథను ప్రారంభించారు. ఆ తర్వాత 'ఆరేళ్ల క్రితం' అంటూ బ్రహ్మానందం వాయిస్ ఓవర్‌తో సినిమాలోని ప్రధాన పాత్రలన్నింటినీ పరిచయం చేశారు.

ADVERTISEMENT

వివరాలు

సినిమా క్వాలిటిపై ప్రేక్షకుల అసంతృప్తి

గ్రామం నుంచి సిటీకి, కాలేజీకి వెళ్లిన తర్వాత అమ్మాయిలకు రెక్కలు వచ్చినట్లు ప్రేమ అంటూ తిరిగే సన్నివేశాలతో కథను నడిపించారు.

రొటీన్ లవ్ ట్రాక్స్, పాత తరహా సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. కీర్తన పెళ్లి చేసుకోవడం, గీత లేచిపోవడంతో ఇంటర్వెల్ పడుతుంది. అప్పటికే సినిమా క్వాలిటీపై ప్రేక్షకులకు అసంతృప్తి కలుగుతుంది.

ఎమోషనల్ సీన్స్‌లో కూడా నవ్వు రావడం, సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అనే భావన కలగడం జరుగుతుంది. సెకండ్ హాఫ్‌లో కీర్తన పెళ్లి తర్వాత ఎదుర్కొనే కష్టాలు, గీత లేచిపోయిన తర్వాత ఎదురయ్యే సమస్యలతో కథను మరింత సాగదీశారు.

చివర్లో అంజని పెళ్లితో అందరినీ కలిపి ఓ రొటీన్ హ్యాపీ ఎండింగ్‌తో సినిమాను ముగించారు.

వివరాలు

దర్శకుడి ప్రయత్నం ఫలించలేదు

ఇన్నేళ్ల గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా దర్శకుడు ఇంకా అక్కడే ఆగిపోయారా? అనిపించేలా కథ ఉంది. పిల్లలు చదువుకునే వయసులో తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకోవడం, లేచిపోయి వెళ్లడం, ఆ తర్వాత వారు ఎదుర్కొనే కష్టాల చుట్టూ ఇప్పటికే వందలాది సినిమాలు వచ్చాయి.

దాదాపు 20 ఏళ్ల క్రితం తేజ కూడా ఇలాంటి ట్రెండ్ సినిమాలతో పలు కథలు తెరకెక్కించారు. అలాంటి కథను ఇప్పుడు చెప్పడం అంతగా కనెక్ట్ అయ్యేలా అనిపించదు.

ఫస్ట్ హాఫ్ చాలా భారంగా ఉంటుంది. ముక్కలు ముక్కలుగా చేసిన సన్నివేశాలు, రొటీన్ లవ్ ట్రాక్స్‌తో కథ ముందుకు సాగుతుంది.

వివరాలు

కామెడీ వర్కౌట్ కాలేదు

కొన్ని చోట్ల కామెడీని ప్రయత్నించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా ఈ సినిమా రైటింగ్ విషయంలో పలు లాజిక్ లెస్ సీన్స్ కనిపిస్తాయి.

కథ ప్రస్తుత కాలం నుంచి ఆరేళ్లు వెనక్కి వెళ్లి, ఒక సంవత్సరం కాలాన్ని చూపిస్తూ 2021లో కథ సాగుతుంది.

అయితే అప్పటికి పిఠాపురానికి పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడున్న రాజకీయ సంబంధం లేదు. ఆయన పిఠాపురంలో గెలవలేదు కూడా. కానీ 2021లో జరిగే కథలోనే 'పిఠాపురం, పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్' అంటూ డైలాగ్స్ పెట్టారు.అసలు ఆ కాలానికి ఆ డైలాగ్ ఎలా సరిపోతుందో అర్థం కాదు.

పైగా ఆ సీన్ కథకు అవసరం కూడా లేనట్లు అనిపిస్తుంది. ఏదో పెట్టాలి అన్నట్లుగా ఆ డైలాగ్‌ను అతికించిన భావన కలుగుతుంది.

వివరాలు

చివర్లో ఎమోషన్స్ డైలాగ్స్ అద్భుతం

ఇలాంటి లాజిక్ లెస్ సన్నివేశాలు సినిమాలో చాలా కనిపిస్తాయి. అయితే తెలిసీ తెలియని వయసులో తప్పుడు మనుషులను ప్రేమగా నమ్మి కష్టాల్లో పడే అమ్మాయిల గురించి ఓ మంచి పాయింట్ చెప్పే ప్రయత్నం మాత్రం చేశారు.

కానీ ఆ పాయింట్‌కు సంబంధించిన ఎమోషన్ మాత్రం పెద్దగా పండలేదు. చివర్లో నాలుగు మోటివేషనల్, ఎమోషనల్ డైలాగ్స్ చెప్పి అందరినీ కలిపేశారు.

సినిమాలో చాలా సన్నివేశాలు చూస్తుంటే సినిమా కాకుండా సీరియల్ చూస్తున్నామేమో అనిపిస్తుంది. అక్కడ ఉపయోగించిన ఎఫెక్ట్స్, ఆర్టిస్టుల నటన కూడా సీరియల్ తరహాలోనే అనిపిస్తాయి.

పలుచోట్ల నటీనటులు సినిమా కోసం కాకుండా సీరియల్‌లో నటిస్తున్నట్లుగా ఎందుకు యాక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది.

వివరాలు

ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు

సినిమా మొత్తంలో తండ్రి-కూతురు మధ్య ఎమోషన్‌ను పండించడానికి దర్శకుడు బాగా ప్రయత్నించారు.

కానీ ఆ ఎమోషన్ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అదే సమయంలో తండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు.

ఇండస్ట్రీలో సినిమాలు మానేసిన పలువురు సీనియర్ దర్శకులు ఉన్నారు. వారు అప్పుడప్పుడు సినిమా రిలీజ్ ఈవెంట్స్‌కు గెస్ట్‌లుగా రావడం తప్ప కొత్త సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు.

అలాంటి సమయంలో ఒకప్పుడు కొన్ని మంచి సినిమాలు తీసిన దర్శకుడు ఇంత గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శలు ఎదుర్కోవడం అవసరమా? అనిపిస్తుంది.

వివరాలు

రోటిన్ గా కథ

అసలు ఎవరైనా సినిమా తీసి దర్శకుడిగా ఈయన పేరు ఉపయోగించారా? అనే అనుమానం కూడా కలుగుతుంది.

ఇక పిఠాపురం పేరుకు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఓ ప్రత్యేకమైన బ్రాండ్ వచ్చింది. అలాంటి బ్రాండ్ ఉన్న పేరును టైటిల్‌గా ఉపయోగించి దానికి చెడ్డ పేరు రాకుండా ఉంటే చాలు అనిపిస్తుంది.

మొత్తంగా.. 'పిఠాపురంలో అలా మొదలైంది' పాత కథ, రొటీన్ లవ్ ట్రాక్స్, సాగదీత, లాజిక్ లెస్ సన్నివేశాలతో నిరాశపరుస్తుంది. కథలో మంచి పాయింట్ ఉన్నప్పటికీ దాన్ని ప్రభావవంతంగా చెప్పడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు.

థియేటర్లలో ఈ సినిమాను చూసేంత డేర్ చేయకపోవడమే మంచిది. ఓటీటీలో వచ్చినా ఫాస్ట్ ఫార్వార్డ్‌లో చూస్తే సరిపోతుందేమో అనిపిస్తుంది.

ADVERTISEMENT