
Retro : 'రెట్రో' మూవీకి స్వంత గొంతుతో డబ్బింగ్ చెప్పనున్న పూజా హెగ్డే
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉండేది. ఎందుకంటే హీరోయిన్స్‌కు, హీరోలకు వారి స్వంత వాయిస్ సరిగ్గా సరిపోదు.
అందుకే ప్రత్యేకంగా డబ్బింగ్ ఆర్టిస్టులను నియమించేవారు. అయితే ప్రస్తుతం హీరోయిన్లు తమ స్వంత గొంతుతో డబ్బింగ్ చెప్పేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
తెరపై పాత్రలు సహజంగా కనిపించడంతో పాటు, అభిమానులకు మరింత దగ్గరయ్యే అవకాశముందని భావిస్తూ తమ స్వంత డబ్బింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇప్పటికే రష్మిక మందన్న, కీర్తి సురేష్, సాయి పల్లవి వంటి ప్రముఖ హీరోయిన్లు తమ సినిమాలకు స్వయంగా డబ్బింగ్ అందిస్తున్నారు.
ఈ జాబితాలో తాజాగా పూజా హెగ్డే కూడా చేరింది. ఈ అందాల భామ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య సరసన 'రెట్రో' అనే చిత్రంలో నటిస్తోంది.
వివరాలు
మే నెలలో ప్రేక్షకుల ముందు..
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మూవీ కోసం పూజా హెగ్డే తొలిసారి తమిళంలో తన స్వంత గొంతుతో డబ్బింగ్ చెప్పిందట.
ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ, "నా కెరీర్‌లో తొలిసారి స్వయంగా డబ్బింగ్ చెప్పడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఇకపై అన్ని భాషల్లోనూ ఇదే పద్ధతిని కొనసాగించాలని అనుకుంటున్నాను. త్వరలోనే తెలుగు సినిమాల్లో కూడా ఓన్ డబ్బింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పింది.
వివరాలు
తమిళ సినీ పరిశ్రమపై పూజా హెగ్డే దృష్టి
ఇటీవల పూజా హెగ్డే మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది.అందుకే ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమపై పూర్తిగా దృష్టి పెట్టింది.
'రెట్రో'తో పాటు, దళపతి విజయ్‌తో 'జన నాయగన్', రాఘవ లారెన్స్‌తో 'కాంచన-4' వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది.
మరి ఈ సినిమాలు ఆమెకు మునుపటి క్రేజ్ తిరిగి తీసుకొస్తాయా? లేదా? అనేది వేచి చూడాలి.