ఆ ఇద్దరిపై మండిపడ్డ పూనమ్ కౌర్.. ప్రతి ఒక్కరిని గురువు అని పిలవొద్దని హితవు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీ పరిశ్రమలో పూనమ్ కౌర్ ఫైర్ బ్రాండ్ గా మారారు. వివాదాస్పదమైన అంశాలతోనే ప్రాచుర్యం పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆమె పెట్టే పోస్టులు తరుచుగా వైరల్ అవుతున్నాయి.
పూనమ్ పోస్టులు ఇద్దరు ప్రముఖులని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఈ నటీమణి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
సోమవారం గురుపూర్ణిమ ( వ్యాస పూర్ణిమ ) సందర్భంగా ఇన్‌స్టాలో పూనమ్ ఓ పోస్ట్ చేసింది. ప్రతి టామ్, డిక్ అండ్ హారీలను గురువుగా సంబోధించొద్దని, ఆ మేరకు వాళ్లకు ఆ గుర్తింపు ఇవ్వొద్దని పూనమ్ రాసుకొచ్చారు.
స్టేజీ మీద నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునేవాడు గురువు కాదని, దారి చూపించేవారే గురువు అవుతారని వ్యంగాస్త్రాలు సంధించారు.
DETAILS
బండ్ల గణేష్ పోస్టుకు మండిపడ్డ పూనమ్
టాలీవుడ్‌లో ఓ ప్రముఖ దర్శకుడిని అందరూ గురూజీ అంటుంటారు. సోషల్ మీడియా పోస్టులతో ఆయన్నే లక్ష్యంగా చేసుకుందా, అందుకే ఇంతలా విమర్శిస్తోందా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అందులో ఒకరు హీరో పవన్ కల్యాణ్ కాగా మరొకరు మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్. సందు దొరికినప్పుడల్లా వీరిపై ఈ యంగ్ బ్యూటీ బుస్సుమంటోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే, గురు పౌర్ణమి సందర్భంగా సినీనటుడు బండ్ల గణేష్ ఈశ్వర పవనేశ్వర పవరేశ్వర మీకు గురువు పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు.
ఇది చూసిన పూనమ్ కు ఒళ్లు మండిపోయింది. దీంతో గణేష్ పోస్టుపై పూనమ్ ఊహించని స్థాయిలో మండిపడింది. ఈ మేరకు పరోక్ష వ్యాఖ్యలతో చురకలు అంటించింది.