LOADING...
Fauzi : ప్ర‌భాస్‌-హ‌ను మూవీకి టైటిల్ ఫిక్స్.. అదిరిపోయిన ఫ‌స్ట్‌లుక్ ..
ప్ర‌భాస్‌-హ‌ను మూవీకి టైటిల్ ఫిక్స్.. అదిరిపోయిన ఫ‌స్ట్‌లుక్ ..

Fauzi : ప్ర‌భాస్‌-హ‌ను మూవీకి టైటిల్ ఫిక్స్.. అదిరిపోయిన ఫ‌స్ట్‌లుక్ ..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

హను రాఘవపూడి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్ర‌భాస్ నటిస్తున్న సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కొత్త హీరోయిన్ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను అధికారికంగా వెల్లడించారు. సినిమాకు "ఫౌజీ (Fauzi)" అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. పోస్టరులో ప్రభాస్ చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్