Prabhas: రచయితల కోసం 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్ లాంచ్ చేసిన ప్రభాస్
రచయితల ప్రతిభను ప్రోత్సహించే దిశగా, 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' అనే వెబ్‌సైట్‌ను రెబెల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా లాంఛ్ చేశారు. తన సినిమాలతో విభిన్నమైన కథలు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రభాస్, ఈ వెబ్‌సైట్ ద్వారా మరిన్ని క్రియేటివ్ టాలెంట్‌ను ఇండస్ట్రీలోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్‌సైట్‌పై రచయితలు తమ స్క్రిప్ట్‌ను 250 పదాల పరిమితిలో అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సైట్ ద్వారా వీక్షకులు కథలను చదివి వాటికి రేటింగ్స్ ఇవ్వొచ్చు. అత్యధిక రేటింగ్ సాధించిన స్క్రిప్ట్‌లు టాప్ ప్లేస్‌లో నిలిచేలా డిజైన్ చేశారు. రేటింగ్స్ ద్వారా రచయితల ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమాలకు పనిచేసే ఛాన్స్
మొదటి ప్రయత్నంగా, 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్‌సైట్, రచయితలను "మీ ఫేవరైట్ హీరోకి సూపర్ పవర్స్ ఇచ్చితే ఎలా ఉంటుందనే" కాన్సెప్ట్‌తో స్క్రిప్ట్‌లను ఆహ్వానిస్తోంది. ఈ వెబ్‌సైట్ ద్వారా రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు సినిమాల్లో పనిచేసే అవకాశాలను పొందవచ్చు. రచయితలు తమ కథలను ఆడియో బుక్స్‌గా మారుస్తూ, వాటిని మరింత పెద్ద ప్రేక్షకవర్గానికి అందించగలుగుతారు. 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' ఈ విధంగా రైటర్లకూ, కథలకూ మంచి గుర్తింపు తెచ్చే అవకాశాలను కల్పిస్తుంది.