Page Loader
Prabhas: 'రాజా సాబ్'.. ప్రభాస్-మారుతి కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా 
Prabhas: 'రాజా సాబ్'.. ప్రభాస్-మారుతి కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా

Prabhas: 'రాజా సాబ్'.. ప్రభాస్-మారుతి కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా 

వ్రాసిన వారు Stalin
Jan 15, 2024
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి పండగ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. మారుతి- ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా టైటిల్‌ను సోమవారం మేకర్స్ ప్రకటించారు. అలాగే ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా గ్రాండ్‌గా రివీల్ చేశారు. ఈ సినిమాకు 'ది రాజా సాబ్(The Raja Saab)' అనే టైటిల్ కూడా పెట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను భీమవరంలో భారీ డిజిటల్ స్క్రీన్‌పై రిలీజ్ చేయడం విశేషం. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రభాస్.. నల్ల చొక్కా, లుంగీ, గడ్డంతో స్టైలిష్‌గా కనిపించాడు. ప్రభాస్ కొత్తగా కనిపించడంతో అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఈ సినిమాను తెరకెక్కిస్తుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ ట్వీట్