సరికొత్త లుక్ లో అదిరిపోతున్న ప్రభాస్
కొంతకాలం క్రితం ప్రభాస్ లుక్స్ పై చాలా విమర్శలు వచ్చాయి. బాహుబలి తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్ చిత్రాల్లో ప్రభాస్ లుక్ బాలేదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రస్తుతం తన సరికొత్త లుక్ తో సమాధానం చెబుతున్నాడు ప్రభాస్. వరుసగా సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్, ప్రతీ చిన్న విషయంలోనూ జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లుక్ విషయంలో ప్రత్యేక కేర్ తీసుకుంటున్నాడని సమాచారం. తాజాగా విడుదలైన లుక్ చూస్తే ఆ విషయం నిజమే అని అర్థమవుతోంది. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్, కళ్ళకు గ్లాసెస్ పెట్టుకుని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూడగానే అభిమానులు సంతోషపడుతున్నారు. అదే టైమ్ లో అందరికీ ఓ ప్రశ్న ఎదురైంది.
ప్రభాస్ లుక్ ఏ సినిమా కోసమో తెలుసుకోవాలన్న ఆసక్తిలో ఫ్యాన్స్
స్టైలిష్ గా కనిపిస్తున్న ప్రభాస్ లుక్, ఏ సినిమా కోసమనేది అభిమానులకు తెలియట్లేదు. ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, రాజా డీలక్స్, ప్రాజెక్ట్ కె చిత్రాల షూటింగుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూడింటిలో సలార్ మూవీ షూటింగ్ ఫిబ్రవరి నెలలో ఐపోవస్తుందని వార్తలు వచ్చాయి. ప్రాజెక్ట్ కె మూవీ సైన్స్ ఫిక్షన్ కాబట్టి, స్టైలిష్ గా కనిపిస్తున్న లుక్ రాజా డీలక్స్ కోసమే అయ్యుంటుందని అనుకుంటున్నారు. మిర్చి, డార్లింగ్ సినిమాలో మాదిరిగా సరదా సరదాగా రాజా డీలక్స్ మూవీలో ప్రభాస్ ని మారుతి చూపించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కాబట్టి ఆ సినిమా కోసలే అల్ట్రా స్టైలిష్ గా మారి ఉంటారని అంచనా వేస్తున్నారు.