NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సలార్, ప్రాజెక్ట్ కె అప్డేట్లపై ప్రభాస్ పెట్టిన కండీషన్స్?
    తదుపరి వార్తా కథనం
    సలార్, ప్రాజెక్ట్ కె అప్డేట్లపై ప్రభాస్ పెట్టిన కండీషన్స్?
    సలార్, ప్రాజెక్ట్ కె అప్డేట్ల పై ప్రభాస్ కండీషన్లు పెట్టినట్లు వార్తలు

    సలార్, ప్రాజెక్ట్ కె అప్డేట్లపై ప్రభాస్ పెట్టిన కండీషన్స్?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 16, 2023
    05:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ మధ్య అభిమానుల నుంచి అప్డేట్ల గోల చాలా ఎక్కువగా వినిపిస్తోంది. అప్డేట్ కావాలంటూ నిర్మాతల మీద ఒత్తిడి పెంచుతున్నారు. సాక్షాత్తు సినిమా హీరోలే దిగివచ్చి అప్డేట్ల విషయంలో ఆత్రపడద్దని అభిమానులకు చెప్పాల్సి వస్తోంది.

    ఈ అప్డేట్ల విషయంలో ప్రభాస్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్ సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నాడు.

    అయితే ఈ మూడు సినిమాల నుండి అప్డేట్లు అప్పుడే బయటకు ఇవ్వొద్దని ప్రభాస్ కండిషన్ పెట్టాడట. ఎలాంటి చిన్న అప్డేట్ కూడా జూన్ వరకు ఇవ్వరాదని చెప్పాడట. ఆదిపురుష్ సినిమా కోసమే ఇలాంటి కండిషన్లు పెట్టాడని చెప్పుకుంటున్నారు.

    ప్రభాస్

    ఆదిపురుష్ హైప్ కోసమే అప్డేట్లు వద్దంటున్న ప్రభాస్

    ఆదిపురుష్ టీజర్ రిలీజయ్యాక దానిమీద ఎంత నెగెటివిటీ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ కారణంగానే జనవరిలో రిలీజ్ కావాల్సిన సినిమా, జూన్ కి వాయిదా పడింది.

    ఇప్పుడు ఆదిపురుష్ సినిమాకు హైప్ పెంచడమనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైమ్ లో వేరే సినిమాల అప్డేట్లు ఇస్తే ఆదిపురుష్ సినిమాపై అభిమానులకు ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది.

    ఆ ఆసక్తి తగ్గకుండా ఉండాలంటే మిగతా సినిమాల అప్డేట్లు ఆపేయాలని నిర్ణయించుకున్నారట. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమైతే మంచిదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    ఆదిపురుష్ కోసం ప్రభాస్ అలాంటి నిర్ణయం తీసుకోవడం సబబుగానే ఉందనీ మరికొంతమంది అంటున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదిపురుష్ మూవీ, జూన్ 16వ తేదీన విడుదలవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలుగు సినిమా

    మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ? మహేష్ బాబు
    మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న? బాలకృష్ణ
    ఎన్నెన్నో జన్మల బంధం ఈనాడే కన్నుమూసింది, సింగర్ వాణీజయరాం హఠాన్మరణం సినిమా
    గీత గోవిందం కాంబోతో బిజీ అవుతున్న విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025