
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' మూవీ అప్డేట్ వచ్చిసిందోచ్.. షూటింగ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిగా ఉన్నారు. ప్రస్తుతం సలార్, కల్కి, మారుతీ సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో 'స్పిరిట్' అనే సినిమాను చేయనున్నాడు.
ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా..? అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీ గురించి సందీప్ వంగా ఒక కీలక అప్డేట్ ఇచ్చారు.
'యానిమల్'(Animal) మూవీ ప్రమోషన్ల భాగంగా సందీప్ వంగా, రణబీర్, రష్మిక.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు.
Details
2024 సెప్టెంబర్ లో స్పిరిట్ షూటింగ్ ప్రారంభం
అన్ స్టాపబుల్ షోలో బాలయ్య, ప్రభాస్ స్పిరిట్ సినిమా గురించి ప్రశ్నించారు.
దీనిపై దర్శకుడు సందీప్ స్పందిస్తూ.. 2024 సెప్టెంబర్‌లో మొదలవుతుందని సమాధానం ఇచ్చాడు.
ఈ వార్త విన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు అధికారి పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమా చూడాలంటే 2025 వరకు అగాల్సిందే.