LOADING...
Prabhas : 'ఫౌజీ' షూటింగ్‌లో ప్రభాస్‌కు స్వల్ప గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్
'ఫౌజీ' షూటింగ్‌లో ప్రభాస్‌కు స్వల్ప గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్

Prabhas : 'ఫౌజీ' షూటింగ్‌లో ప్రభాస్‌కు స్వల్ప గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో విడుదలైన 'ది రాజాసాబ్' సందర్భంగా ఆయన లుక్‌, బాడీ లాంగ్వేజ్‌పై సోషల్ మీడియాలో కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు వినిపించాయి. కొందరు నెటిజన్లు ఫేస్-స్వాప్ టెక్నాలజీ వాడుతున్నారని, ప్రభాస్ పూర్తిగా కష్టపడటం లేదని ట్రోలింగ్‌కు దిగారు. కానీ తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన ఈ విమర్శలకు అభిమానుల నుంచి గట్టిగా సమాధానం ఇస్తోంది. ప్రస్తుతం ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని కీలకమైన గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా ప్రభాస్ గుర్రంపై నుంచి అదుపుతప్పి కిందపడటంతో చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈవిషయం బయటకు రాగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

Details

రెండ్రోజుల విశ్రాంతి అవసరం

అయితే అది చిన్న గాయమేనని, ప్రభాస్ త్వరగా కోలుకున్నారని సమాచారం రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సందర్భాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు ట్రోలర్లపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. డూప్స్ వాడకుండా రిస్కీ సీన్స్ స్వయంగా చేస్తే ఇలాంటి సంఘటనలు సహజమే. ప్రభాస్ ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో ఇది స్పష్టమైన ఉదాహరణ అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. తన ఆరోగ్యాన్ని కూడా పక్కనపెట్టి సినిమాల కోసం శ్రమిస్తున్నారనే భావనను ఈ ఘటన మరింత బలపరిచిందని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రభాస్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నారు. 'ఫౌజీ'తో పాటు 'స్పిరిట్' చిత్రాలను త్వరితగతిన పూర్తి చేసి, అనంతరం కొంతకాలం ఆరోగ్యంపై దృష్టి సారించాలని 'డార్లింగ్' భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement