LOADING...
Prabhas: మరో కొత్త లుక్‌లో ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
మరో కొత్త లుక్‌లో ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

Prabhas: మరో కొత్త లుక్‌లో ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2026
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

కథానాయకుడు ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ చిత్రాలతో సెట్స్‌పై బిజీగా కొనసాగుతున్నారు. వాటిలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న Kalki 2898 AD సీక్వెల్‌ కూడా ఒకటి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దీనిని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో లెజెండరీ నటులు అమితాబ్ బచ్చనన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం 'కల్కి 2' షూటింగ్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్స్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

వివరాలు

కొత్త షెడ్యూల్ మే నెల తొలివారంలో రిలీజ్

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ మే నెల తొలి వారంలో ప్రారంభం కానుంది. ఆ షెడ్యూల్‌లో ప్రభాస్‌ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో ప్రభాస్‌ కర్ణ, భైరవ పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు రెండో భాగంలో ఈ రెండు పాత్రలతో పాటు మరో కొత్త లుక్‌లోనూ ఆయన కనిపించి అభిమానులను ఆశ్చర్యపరచనున్నారని సమాచారం. మహాభారతంతో ముడిపడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ కథలో అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్రలో, కమల్‌ హాసన్‌ సుప్రీం యాస్కిన్‌గా నటిస్తున్నారు. ఇక ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు.

Advertisement