Loading...
Dragon : 'డ్రాగన్' కోసం ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం.. ఎన్టీఆర్ మూవీకి డిఫరెంట్ మేకింగ్!
'డ్రాగన్' కోసం ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం.. ఎన్టీఆర్ మూవీకి డిఫరెంట్ మేకింగ్!

Dragon : 'డ్రాగన్' కోసం ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం.. ఎన్టీఆర్ మూవీకి డిఫరెంట్ మేకింగ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2026
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 'కేజీఎఫ్', 'సలార్' వంటి చిత్రాలతో డార్క్ టోన్, రా అండ్ రస్టిక్ విజువల్స్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. ఈ సినిమాతో తన మేకింగ్‌లో సరికొత్త ప్రయోగం చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్‌లో ఎన్టీఆర్ లుక్, సినిమా బ్యాక్‌డ్రాప్ పూర్తిగా డార్క్, రఫ్ అండ్ రస్టిక్‌గా కనిపించాయి. అయితే సినిమాలోని కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ మాత్రం వీటికి పూర్తి భిన్నంగా ఉండనున్నట్లు సమాచారం. ఈసన్నివేశాలను వైబ్రెంట్‌గా, కలర్‌ఫుల్‌గా చూపించేందుకు ప్రశాంత్ నీల్ ప్రత్యేకమైన విజువల్ ట్రీట్‌మెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

రెండు కాలాలకు రెండు భిన్నమైన లుక్స్

కథలోని రెండు వేర్వేరు కాలాలను ప్రేక్షకులకు స్పష్టంగా అర్థమయ్యేలా చేయడానికి కలర్ కాంట్రాస్ట్‌ను ఉపయోగించనున్నట్లు టాక్.

ప్రస్తుత కాలానికి సంబంధించిన సన్నివేశాలను ప్రశాంత్ నీల్ తన మార్క్‌కు తగ్గట్టుగా డార్క్ షేడ్స్‌లో చూపించనున్నారట.

అదే సమయంలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ప్రకాశవంతమైన రంగులు, విభిన్నమైన లైటింగ్, కొత్త తరహా ఫ్రేమింగ్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం.

ఈ మార్పు కేవలం విజువల్ బ్యూటీ కోసం మాత్రమే కాకుండా.. కథలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కీలకమైన మార్పులను ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ చేసేందుకు ఉపయోగపడనుందని తెలుస్తోంది.

ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపించే కలర్‌ఫుల్ ప్రపంచానికి, ఆ తర్వాత ఎన్టీఆర్ పాత్ర ఎదుర్కొనే చీకటి పరిస్థితులకు మధ్య ఉండే వ్యత్యాసం సినిమాకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.

వివరాలు

1960ల గ్లోబల్ మాఫియా నేపథ్యంలో కథ?

'డ్రాగన్' కథ 1960ల కాలం నాటి గ్లోబల్ మాఫియా, నల్లమందు అక్రమ వ్యాపారం, అంతర్జాతీయ యుద్ధ వాతావరణం చుట్టూ సాగనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇప్పటివరకు కనిపించని విధంగా అత్యంత వైలెంట్, ఇంటెన్స్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని సమాచారం.

సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఎన్టీఆర్, అనిల్ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలు కథలో చాలా కీలకంగా ఉండనున్నట్లు టాక్.

ADVERTISEMENT

వివరాలు

రవి బస్రూర్ మ్యూజిక్ హైలైట్

'డ్రాగన్'కు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన అందించనున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు యాక్షన్ ఎలివేషన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.

సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ కూడా డార్క్ వరల్డ్‌కు, కలర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌కు అనుగుణంగా ప్రత్యేకమైన లైటింగ్, ఫ్రేమింగ్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

అక్టోబర్‌లో షూటింగ్‌కు ఎన్టీఆర్?

ఇటీవల భుజానికి గాయం కావడంతో ఎన్టీఆర్ సర్జరీ చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

పూర్తిగా కోలుకున్న అనంతరం అక్టోబర్ మొదటి వారం నుంచి 'డ్రాగన్' రెగ్యులర్ షూటింగ్‌లో ఆయన తిరిగి పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన సన్నివేశాలను ఆయన షూటింగ్‌లోకి తిరిగి వచ్చే సమయానికి అనుగుణంగా మేకర్స్ రీషెడ్యూల్ చేస్తున్నట్లు సమాచారం.

వివరాలు

వచ్చే ఏడాది జూన్ 11న విడుదల

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 'డ్రాగన్' ప్రేక్షకుల ముందుకు రానుంది.

డార్క్ అండ్ రస్టిక్ ప్రస్తుత కాలంతో పాటు.. పూర్తిగా భిన్నమైన కలర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నారన్నది ఇప్పుడు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ADVERTISEMENT