LOADING...
Preity Mukhundhan: అల్లు అర్జున్ 'రాకా' ఛాన్స్ మిస్‌ చేసుకున్న బ్యూటీ ఎవరంటే?
అల్లు అర్జున్ 'రాకా' ఛాన్స్ మిస్‌ చేసుకున్న బ్యూటీ ఎవరంటే?

Preity Mukhundhan: అల్లు అర్జున్ 'రాకా' ఛాన్స్ మిస్‌ చేసుకున్న బ్యూటీ ఎవరంటే?

వ్రాసిన వారు Moogati Shabari
Jul 08, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రాకా' గురించి గత కొంతకాలంగా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నటించే అవకాశం యువ నటి ప్రీతి ముకుందన్‌కు వచ్చినప్పటికీ, ఆమె ఆ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయిందనే ప్రచారం జరిగింది. తాజాగా ఆ వార్తలపై దర్శకుడు అట్లీ స్వయంగా స్పందించి అసలు విషయాన్ని వెల్లడించారు. తమిళ చిత్రం 'హృదయం మురళి' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మాట్లాడిన అట్లీ, ప్రీతి ముకుందన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆమె నటన తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్న ఆయన, 'రాకా'లోని ఒక కీలక పాత్ర కోసం మొదట ప్రీతినే సంప్రదించినట్లు తెలిపారు.

వివరాలు

డేట్స్ సమస్యే కారణమా?

అయితే, అప్పటికే ఇతర సినిమాలతో ప్రీతి బిజీగా ఉండటంతో ఈ చిత్రానికి అవసరమైన తేదీలను కేటాయించడం సాధ్యపడలేదని చెప్పారు. డేట్స్ సమస్య కారణంగానే ఆమె ఈ భారీ ప్రాజెక్ట్‌ను వదులుకోవాల్సి వచ్చిందని అట్లీ స్పష్టం చేశారు. ప్రీతి చేయలేకపోయిన అదే కీలక పాత్రను మలయాళ నటి ఫెమినా జార్జ్‌కు ఆఫర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆ పాత్ర స్వరూపం, కథలో దాని ప్రాధాన్యం వంటి వివరాలను మాత్రం ప్రస్తుతం గోప్యంగానే ఉంచారు. ఇక ప్రీతి ముకుందన్ విషయానికి వస్తే, 'కన్నప్ప' సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన ఆమె, ఇటీవల 'బ్లాస్ట్‌' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'హృదయం మురళి' ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జులై 10న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement