
Preity Zinta: టెస్టులకు విరాట్ రిటైర్మెంట్.. స్పందించిన బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ రిటైర్మెంట్‌పై బాలీవుడ్ ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు.
ఇప్పటికే విక్కీ కౌశల్, అనిల్ కపూర్, రణ్‌వీర్ సింగ్ వంటి నటులు తమ భావనలు వ్యక్తం చేయగా, తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమానిగా ఉన్న ప్రీతి జింటా కూడా విరాట్ టెస్ట్ రిటైర్మెంట్‌పై స్పందించింది.
విరాట్ కోసమే టెస్ట్ క్రికెట్ చూశానని ప్రీతి తెలిపింది. ఆటపై విరాట్‌కు ఉన్న మక్కువను ప్రశంసించింది.
సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ, ఇకపై టెస్ట్ క్రికెట్ మునుపట్లా ఉండదని అభిప్రాయపడింది.
వివరాలు
నేను టెస్ట్ క్రికెట్‌ను విరాట్ కోసమే చూశాను
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'లో ఒక యూజర్ ప్రీతి జింటాను ఉద్దేశిస్తూ, "విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయాన్ని విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?" అని ప్రశ్నించాడు.
దానికి ప్రతిస్పందనగా ప్రీతి జింటా -"నేను టెస్ట్ క్రికెట్‌ను విరాట్ కోసమే చూశాను.అతను ఆటను నిజమైన ఆసక్తితో నింపాడు. టెస్ట్ ఫార్మాట్ ఇక మునుపటి తరహాలో ఉండబోదని నాకు అనిపిస్తోంది. భవిష్యత్తులో అతని ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న భారత జట్టు ఆటగాళ్లు - విరాట్, రోహిత్, అశ్విన్ వంటి వారిని భర్తీ చేయడం ఒక పెద్ద బాధ్యత" అని పేర్కొంది.
ప్రీతి వ్యాఖ్యలపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. చాలా మంది ఆమె అభిప్రాయాలను సమర్థించారు.
వివరాలు
ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పైకి ప్రీతి జింటా
ఒక యూజర్ వ్యాఖ్యానిస్తూ.. "మొత్తానికి నిజం,విరాట్ కోహ్లీ యుగంలో టెస్ట్ మ్యాచ్‌లు చూడటం ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఆటలో అభిరుచి, గర్వం కనిపించేది" అని తెలిపాడు.
మరో యూజర్ మాట్లాడుతూ.. "ఇకపై టెస్ట్ క్రికెట్ గతంలా ఉండదు" అని వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉండగా, సినిమాల పరంగా ప్రీతి జింటా బిజీ అవుతోంది. దాదాపు ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పైకి రావడానికి సిద్ధమవుతోంది.
రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కనున్న "లాహోర్ 1947" సినిమాలో సన్నీ డియోల్, షబానా అజ్మీ, అలీ ఫజల్‌తో కలిసి నటించనుంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు.