NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ప్రాజెక్ట్ కె: మహావిష్ణు అవతారంలో ప్రభాస్?
    తదుపరి వార్తా కథనం
    ప్రాజెక్ట్ కె: మహావిష్ణు అవతారంలో ప్రభాస్?
    ప్రాజెక్ట్ కె మూవీలో ఆధునిక విష్ణువు అవతారంలో ప్రభాస్

    ప్రాజెక్ట్ కె: మహావిష్ణు అవతారంలో ప్రభాస్?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 01, 2023
    04:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సైన్స్ ఫిక్షన్, ప్రాజెక్ట్ కె మూవీకి సంబంధించి ఇప్పటి వరకు రెండు మూడు పోస్టర్లు విడుదలయ్యాయి.

    ఈ పోస్టర్ల ద్వారా సినిమా కథేంటన్నది కొంచెం కూడా అర్థం కాలేదు. అందుకే ఈ సినిమా కథ విషయంలో అందరికీ ఆసక్తి ఉంది. తాజాగా చిత్ర నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ, కొన్ని విశేషాలు పంచుకున్నారు.

    ప్రాజెక్ట్ కె మూవీ, ఒక కల్పిత కథగా రూపొందుతుందనీ, సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ తరం శ్రీ విష్ణు అవతారానికి సంబంధించిన కథగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

    అంతేకాదు, ఈ సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుందనీ, అది అందరికీ నచ్చుతుందని అన్నారు అశ్వనీదత్.

    ప్రాజెక్ట్ కె

    అమితాబ్, దీపికాల షూటింగ్ పూర్తి

    ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోందనీ, మరికొద్ది రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుందనీ, కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుందని తెలిపారు.

    అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే.. ఇద్దరి షూటింగ్ చివరి దశకు వచ్చేసిందనీ, మరికొద్ది రోజులో పూర్తయి పోతుందని అన్నారు.

    ఐతే ఇదంతా పక్కన పెట్టేస్తే ప్రస్తుతం ప్రభాస్ పాత్ర గురించే ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే అటు ఆల్రెడీ ఆదిపురుష్ సినిమాలో రామవతారం లో కనిపిస్తున్నాడు ప్రభాస్.

    ఇప్పుడు ప్రాజెక్ట్ కె లో ఆధునిక విష్ణువు అవతారంలో కనిపిస్తున్నాడని వినబడడం అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. 2024 జనవరి 12వ తేదీన ప్రాజెక్ట్ కె విడుదల అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    తెలుగు సినిమా

    ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్: అదుర్స్ మళ్లీ వచ్చేస్తుంది? జూనియర్ ఎన్టీఆర్
    ఏజెంట్ మూవీ బడ్జెట్: అఖిల్ సినిమాకు హిట్ సరిపోదు, బ్లాక్ బస్టర్ కావాలి? సినిమా
    బాలయ్యకు జోడీగా మరోమారు ప్రగ్యా జైశ్వాల్ బాలకృష్ణ
    ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ పై తాజా అప్డేట్ జూనియర్ ఎన్టీఆర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025