డబల్ ఇస్మార్ట్: పూరీ జగన్నాథ్ కు హిట్ పడాలంటే రామ్ కావాల్సిందేనా?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా పరిశ్రమలో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని, ఎంతోమందిని స్టార్ హీరోలుగా తీర్చిదిద్దిన ఘనత దర్శకుడు పూరీ జగన్నాథ్ కు దక్కుతుంది.
మాస్ ఫాలోయింగ్ ఏర్పడాలంటే పూరీ జగన్నాథ్ తో సినిమా చేయాలని అప్పట్లో హీరోలు భావించేవారు. అయితే గత కొన్ని రోజులుగా పూరీ జగన్నాథ్ కు సరైన హిట్ పడలేదు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయమే అందుకున్నా ఆ తర్వాత లైగర్ తో, డిజాస్టర్ మూటగట్టుకున్నాడు పూరీ. లైగర్ రిలీజై చాలా రోజులు అవుతున్నా, పూరీ నెక్స్ట్ సినిమా ఇంకా అనౌన్స్ కాలేదు.
తాజాగా ఈ విషయంలో కొన్ని పుకార్లు ఇంటర్నెట్ లో పుట్టుకొస్తున్నాయి. పూరీ జగన్నాథ్ తర్వాతి సినిమా హీరో రామ్ తో ఉంటుందని అంటున్నారు.
Details
ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్
హీరో రామ్ తో మరోమారు మాస్ సినిమా తీయాలని పూరీ జగన్నాథ్ అనుకుంటున్నారని ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ ని రూపొందించాలని పూరీ భావిస్తున్నారట.
డబల్ ఇస్మార్ట్ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తారట పూరీ. మరి డబల్ ఇస్మార్ట్ సినిమా విషయంలో రామ్ ఏమన్నాడనేది ఇంకా బయటకు రాలేదు.
ప్రస్తుతానికి బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు రామ్. దసరా సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుంది.
పూరీ జగన్నాథ్ తో సినిమా చేయడానికి రామ్ రెడీగా ఉన్నాడా లేదా అనేది బోయపాటి సినిమా చిత్రీకరణ పూర్తయ్యాకే తెలుస్తుందని అంటున్నారు.