Pushpa 2: పుష్ప 2 ఐటెం సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ ఆరోజే!!
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప 2" మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
మొదటి భాగం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, రెండో భాగాన్ని దర్శకుడు సుకుమార్ మరింత జాగ్రత్తగా రూపొందిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో నవంబర్ 24న, చెన్నైలో భారీ ఈవెంట్ నిర్వహించేందుకు పుష్ప టీం సిద్ధమైంది.
ఆ రోజునే సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ "కిస్సిక్" విడుదల చేయాలని కూడా నిర్ణయించారు.
వివరాలు
ఐటెం సాంగ్ లో అల్లు అర్జున్, శ్రీ లీ
ఈ పాటలో అల్లు అర్జున్, శ్రీ లీల కలిసి డాన్స్ చేశారు. వీరి డాన్స్ స్టెప్పులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని టాక్ వినిపిస్తోంది. ఈ పాట విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తుందని, ఆయన అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.