Page Loader
Pushpa 2 : కల్కి రికార్డును అధిగమించిన పుష్ప 2.. కెనడాలో సరికొత్త చరిత్ర

Pushpa 2 : కల్కి రికార్డును అధిగమించిన పుష్ప 2.. కెనడాలో సరికొత్త చరిత్ర

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

పుష్ప 2 నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి అందరిని ఆశ్చర్యపరచింది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ఈ సినిమా బాహుబలి 2 రికార్డును అధిగమించేందుకు కేవలం రూ.10 కోట్ల దూరంలో ఉంది. 2017లో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి 2, రూ.1810 కోట్లతో భారతీయ బాక్సాఫీస్‌ను శాసించింది. పాన్ ఇండియా సినిమాలకు మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం, ఇప్పటివరకు ఏ సినిమా సైతం దాని రికార్డు దాటలేకపోయింది. ఆర్ఆర్ఆర్ 1300 కోట్లతో అక్కడే ఆగిపోయినా, సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2, మాస్ తాండవం చేసి బాక్సాఫీస్‌ను శాసిస్తోంది.

Details

టాప్ ప్లేస్ లో పుష్ప 2

పుష్ప 2 మరో 10 కోట్ల వసూళ్లు సాధిస్తే బాహుబలి 2ని అధిగమించి టాప్ 2 స్థానంలో నిలుస్తుంది. అమీర్ ఖాన్ 'దంగల్' 2 వేల కోట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నప్పటికీ, పుష్ప 2 రికార్డులను చూసి దంగల్ రికార్డును కూడా అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇండియా మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లోనూ పుష్ప 2 రికార్డులను తిరగరాస్తోంది. కెనడాలో ఈ చిత్రం 4.13 మిలియన్ డాలర్లు వసూలు చేసి హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ మూవీగా నిలిచింది. గతంలో 'కల్కి 2898 ఎడీ' 3.5 మిలియన్ డాలర్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా, పుష్ప 2 దాన్ని దాటేసింది.