Pushpa 2: ఓవర్సీస్ లో రికార్డులు బద్దలుకొడుతున్న పుష్ప రాజ్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ల కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప 2' 2024 డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డులను క్రియేట్ చేసింది. సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఇండియాలో డే-1 కలెక్షన్ రికార్డును సాధించింది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. విదేశీ మార్కెట్‌లోనూ ఈ చిత్రం అద్భుతమైన ఓపెనింగ్‌ను అందుకుంది. ఉత్తర అమెరికాలో మాత్రమే అడ్వాన్స్ సేల్స్ ద్వారా $3.33 మిలియన్లతో ఆల్ టైమ్ హయ్యెస్ట్ అడ్వాన్స్ సేల్స్ సాధించిన 3వ సినిమా గా నిలిచింది.
వెయ్యి కోట్ల దిశగా పుష్ప 2
విడుదలైన మొదటి రోజునే 1.1 మిలియన్లను సంపాదించింది. రెండవ రోజు 6.3 మిలియన్ డాలర్లను రాబట్టి, మూడవ రోజు 6.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి 7 మిలియన్ల మార్క్ ను దాటింది. ఇప్పుడు ఈ సినిమా 8 మిలియన్ మార్క్ ను చేరుకుంది. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ. 500 కోట్లను దాటింది. తాజాగా రూ. 1000 కోట్ల మార్క్ చేరే దిశలో దూసుకెళ్లుతోంది. వీకెండ్ సమయంలో మరిన్ని భారీ కలెక్షన్లు సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.