
Pushpa 2: పుష్ప 2 కు లీకుల బెడద లేకుండా జాగ్రత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2: ది రూల్.
ఈ సినిమాపై భారీ బజ్ ఉంది. ఎక్కడ చూసినా పుష్ప రాజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆగస్ట్ 15న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్సె,టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.
తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో మెప్పిస్తున్నాయి.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈసినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు.
Details
స్పాట్ కు మొబైల్ తీసుకురాకూడదని ఆదేశం
ఇంకా ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.అలాగే ఈ సినిమాకు సంబంధించి ఐటెం సాంగ్ కూడా షూట్ చేయాల్సి వుంది.
అయితే ఈ చిత్రం క్లైమాక్స్ లో షూటింగ్ లో భాగంగా మేకర్స్ మూవీ టీం కి స్ట్రిక్ కండిషన్ పెట్టారు.
ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతి టెక్నిషియన్ షూటింగ్ స్పాట్ కు మొబైల్ తీసుకురాకూడదు అని ఆదేశించారు.
యూనిట్ కమ్యూనికేషన్ కోసం వాకీ టాకీ లను ఉపయోగించాలని కోరింది.క్లైమాక్ షూట్ పిక్స్ రివీల్ కాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి రూల్ పెట్టినట్లు సమాచారం.