Hushar pittalu: ప్రెస్‌మీట్‌లో తీవ్ర భావోద్వేగం.. స్టేజ్‌పైనే చెంపలు వాయించుకున్న నటుడు.. వీడియో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
'హుషార్ పిట్టలు' అనే సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అనూహ్యమైన, భావోద్వేగపూరితమైన దృశ్యం చోటుచేసుకుంది. ఈ చిత్రంలో నటించిన పుట్టా భాను అనే నటుడు, వేదికపై మాట్లాడుతూనే ఒక్కసారిగా తన చెంపలపై తానే గట్టిగా కొట్టుకోవడంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక నటుడి విజయం వెనుక ఉండే కష్టాన్ని, ఆనందాన్ని ఈ సంఘటన కళ్లకు కట్టింది.
వివరాలు
ఆగస్టు 15న విడుదల..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కానున్న 'హుషార్ పిట్టలు' చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.
ఇందులో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిత్ర యూనిట్ సభ్యులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.
ఈ క్రమంలో మైక్ అందుకున్న నటుడు పుట్టా భాను, తన ప్రసంగం మధ్యలో ఒక్క నిమిషం అంటూ తనను తాను నియంత్రించుకోలేక భావోద్వేగంతో చెంపలు వాయించుకున్నారు.
ఊహించని ఈ పరిణామంతో వేదికపై ఉన్న హీరో, హీరోయిన్‌తో పాటు మిగతా వారు కూడా షాక్‌కు గురయ్యారు.
అనంతరం తన చర్యకు గల కారణాన్ని వివరిస్తూ భాను కన్నీటి పర్యంతమయ్యారు. "నా పేరు పుట్టా భాను. సినిమాలో కూడా నా పాత్ర పేరు అదే.
వివరాలు
కథ ఏంటంటే..
చిన్నప్పటి నుంచి సినిమాలంటే నాకు పిచ్చి. మా ఊర్లో ఏ సినిమా ఆడినా మొదటి రోజే చూసేవాడిని.
తెరపై హాస్య సన్నివేశాలు వచ్చినప్పుడు కడుపుబ్బా నవ్వేవాడిని.
అలాంటిది, ఇప్పుడు అదే వెండితెరపై నా నటన చూసి ప్రేక్షకులు నవ్వుతుంటే అదంతా కలలో ఉన్నట్టు అనిపిస్తోంది" అని అన్నారు.
"ఇది కలా లేక నిజమా అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అందుకే, నన్ను నేను గిల్లి చూసుకోవడానికి బదులుగా ఇలా కొట్టుకున్నాను.
గత ఎనిమిదేళ్లుగా ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నాను. అయినా సినిమానే జీవితంగా భావించి ఇక్కడిదాకా వచ్చాను.
వివరాలు
భాను మాటలతో చలించిపోయిన చిత్రబృందం..
ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే నా ఏకైక లక్ష్యం" అంటూ భాను తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
భాను మాటలతో చలించిపోయిన చిత్రబృందం సభ్యులు అతడిని ఆప్యాయంగా ఓదార్చారు.
అక్కడున్న మీడియా ప్రతినిధులు, ఇతర అతిథులు చప్పట్లతో ఆయన అభిరుచిని, అంకితభావాన్ని అభినందించారు.
ఇక భిక్షు దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌లో అన్ష్, వాసవి గణేశ్ జంటగా నటించారు.
గోవర్ధన్, సునీత మనోహర్, రమేష్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.