Loading...
Radhika Sarathkumar praises Ajith kumar: అజిత్‌ను కలిసిన రాధిక.. త్రిషతో ఫొటో షేర్‌ చేసి సందడి
అజిత్‌ను కలిసిన రాధిక.. త్రిషతో ఫొటో షేర్‌ చేసి సందడి

Radhika Sarathkumar praises Ajith kumar: అజిత్‌ను కలిసిన రాధిక.. త్రిషతో ఫొటో షేర్‌ చేసి సందడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2026
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్‌ కథానాయకుడు అజిత్‌ కుమార్‌ (Ajith Kumar) మరోసారి కారు రేసింగ్‌లో పోటీపడేందుకు సిద్ధమయ్యారు. లండన్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్‌ సర్క్యూట్‌లో జరగనున్న 'మిచెలిన్‌ లే మాన్స్‌ కప్‌'లో ఆయన పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటి రాధికా శరత్‌కుమార్‌ (Radhika Sarathkumar) లండన్‌లో అజిత్‌ను కలిశారు. రేసింగ్‌పై అజిత్‌కు ఉన్న ఆసక్తిని, పట్టుదలను రాధికా శరత్‌కుమార్‌ ప్రశంసించారు. ఈ సందర్భంగా అజిత్‌తో కలిసి దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అజిత్‌ ఎప్పుడూ ఎంతో వినయంగా ఉంటారని, అందరికీ ఆదర్శంగా నిలుస్తారని ఆమె పేర్కొన్నారు.

వివరాలు

వైరల్ అయిన ఫోటో

మరోవైపు.. ప్రస్తుతం ఓ మలయాళ సినిమా షూటింగ్‌ కోసం లండన్‌లో ఉన్న స్టార్‌ హీరోయిన్‌ త్రిషను (Trisha)కూడా రాధికా శరత్‌కుమార్‌ కలిశారు.

ఇద్దరూ కలిసి దిగిన సెల్ఫీని ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది.

ఇక అజిత్‌ పాల్గొంటున్న'మిచెలిన్‌ లే మాన్స్‌ కప్‌' సిల్వర్‌స్టోన్‌ రౌండ్‌ సెప్టెంబర్‌ 11, 12తేదీల్లో జరగనుంది. సెప్టెంబర్‌ 12న ప్రధాన రేస్‌ నిర్వహించనున్నారు.

ఈ ఈవెంట్‌కు ముఖ్యమంత్రి విజయ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అజిత్‌ పోటీపడే ఈ రేస్‌ను విజయ్‌ ప్రారంభించనున్నారు.

బాక్సాఫీస్‌ వద్ద పోటీపడిన అజిత్‌, విజయ్‌ వంటి తమిళ సినీ పరిశ్రమలోని ఇద్దరు అగ్ర కథానాయకులు.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ఒకే ఈవెంట్‌లో భాగం కానుండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.

ADVERTISEMENT