
వినాయక చవితి రేసు నుండి తప్పుకున్న చంద్రముఖి 2: జవాన్ సినిమానే కారణం?
ఈ వార్తాకథనం ఏంటి
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ నటించిన చంద్రముఖి 2 సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదలవుతుందని మేకర్స్ వెల్లడి చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.
వినాయక చవితి సందర్భంగా చంద్రముఖి 2 సినిమా చూడాలని అభిమానులందరూ అనుకున్నారు. కానీ సడెన్ గా చంద్రముఖి 2 నిర్మాతలు విడుదల తేదీని మార్చేశారని తెలుస్తోంది.
గ్రాఫిక్స్ పనులు ఆలస్యంగా అవుతున్న కారణంగా చంద్రముఖి 2 సినిమా విడుదల ఆలస్యం అవుతోందని సమాచారం.
వినాయక చవితి రేస్ నుండి తప్పుకున్న చంద్రముఖి 2 సినిమా, సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
Details
కొత్త విడుదల తేదీపై వెలువడని అధికారిక ప్రకటన
ప్రస్తుతానికి చంద్రముఖి 2 కొత్త విడుదల తేదీపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.
మరో విషయం ఏంటంటే, చంద్రముఖి 2 సినిమా వాయిదా పడడానికి కారణం జవాన్ సినిమా కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
జవాన్ సినిమాకు వచ్చిన పాజిటివిటీ కారణంగా కలెక్షన్ల విషయంలో చంద్రముఖి 2 సినిమాకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున సినిమాను వాయిదా వేస్తున్నారని అంటున్నారు.
ఏది ఏమైనా వినాయక చవితికి బాక్సాఫీస్ వద్ద సందడిగా ఉంటుందనుకున్న వాళ్లకు నిరాశ మిగిలినట్లే.
చంద్రముఖి 2 సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. పి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.