Shilpa Shetty: రాజ్ కుంద్రా కేసు ..శిల్పా శెట్టిని అనవసరంగా లాగొద్దని లాయర్ హెచ్చరిక!
రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో ఈడీ సోదాల వార్తలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ సోదాలకు సంబంధించి వస్తున్న వార్తలపై శిల్పా శెట్టి తరపు లాయర్ స్పష్టతనిచ్చారు. శిల్పాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఆమెకు అగౌరవపరిచే విధంగా ఫొటోలు, వీడియోలు ఉపయోగించకూడదని మీడియాకు హెచ్చరించారు. రాజ్ కుంద్రా నివాసాలు లేదా కార్యాలయాల్లో ఎలాంటి ఈడీ సోదాలు జరగలేదని లాయర్ స్పష్టం చేశారు. కేసు విచారణలో రాజ్ కుంద్రా పూర్తిగా అధికారులకు సహకరిస్తున్నారని తెలిపారు. 2021లో అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం ఆరోపణలతో ముంబయి క్రైమ్ బ్రాంచ్ రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేసింది.
శిల్పా శెట్టిని పేరును అనవసరంగా వాడొద్దు
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కుంద్రా గుర్తింపు పొందారు. యువతులను మోసం చేసి అశ్లీల చిత్రాలు నిర్మించి, పలు ఆప్‌ల ద్వారా విడుదల చేసినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ముంబయి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంగణాల్లో ఈడీ సోదాలు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఈ క్రమంలో శిల్పా శెట్టి పేరు అనవసరంగా ప్రచారంలోకి రావడంపై ఆమె లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. శిల్పా శెట్టి పేరు లేకుండా వార్తలు ప్రచురించేందుకు మీడియాను కోరడం బాధ్యతాయుతమైన చర్యగా లాయర్ పేర్కొన్నారు.