LOADING...
Mahesh Babu: 'విలన్ పాత్రలంటే నాకు ఇష్టం'.. రాజమౌళి మెసేజ్‌ను బయటపెట్టిన మహేశ్‌బాబు
'విలన్ పాత్రలంటే నాకు ఇష్టం'.. రాజమౌళి మెసేజ్‌ను బయటపెట్టిన మహేశ్‌బాబు

Mahesh Babu: 'విలన్ పాత్రలంటే నాకు ఇష్టం'.. రాజమౌళి మెసేజ్‌ను బయటపెట్టిన మహేశ్‌బాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో 'వారణాసి' ఒకటిగా నిలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులే కాదు, సినీ ప్రముఖులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా యూనిట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో తన పాత్ర నుంచి కథ ప్రారంభం వరకు దర్శకుడు రాజమౌళితో జరిగిన అనుభవాలను హీరో మహేష్ బాబు వివరించారు.

వివరాలు 

మొదట భయపడ్డాను..

దాదాపు 15 ఏళ్ల క్రితమే రాజమౌళి దర్శకత్వంలో నటించాల్సి ఉందని మహేశ్‌బాబు చెప్పారు. ఇప్పటికి ఆ కల నెరవేరిందని అన్నారు.'ఆర్‌ఆర్‌ఆర్' పూర్తయ్యాక దాదాపు ఏడాది పాటు 'వారణాసి' స్క్రిప్ట్‌పై రాజమౌళి బృందం పని చేసిందని తెలిపారు. ఒకరోజు తనను ఆఫీసుకు పిలిచి కథ వివరించారని,కథ విన్న వెంటనే ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. రాజమౌళి గత చిత్రాలన్నింటికంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని,యాక్షన్‌,అడ్వెంచర్‌,పురాణ కథలు,టైమ్ ట్రావెల్ వంటి ఎన్నో అంశాలు ఇందులో మిళితమై ఉన్నాయని తెలిపారు. రాజమౌళి అభిమానిగా ఈ సినిమా కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, అయితే హీరోగా చేయాల్సి వచ్చినప్పుడు మొదట భయమేసిందని చెప్పారు. అయితే రాజమౌళి కథను వివరించిన తీరు ఆ భయాన్ని పూర్తిగా తొలగించిందని అన్నారు.

వివరాలు 

రెండు షాట్ల కోసం ఆరు నెలలు..

ఈ సినిమాలో లుక్స్‌ కోసం ఎన్నో రిహార్సల్స్ చేశామని మహేశ్‌బాబు చెప్పారు. 2024 నుంచే ఈ పనుల్లో బిజీగా ఉన్నామని, గతేడాది జర్మనీకి కూడా వెళ్లినట్టు తెలిపారు. రాజమౌళి ప్రతి చిన్న అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారని, అవసరమైతే ఎన్నిసార్లైనా రిహార్సల్స్ చేయిస్తారని అన్నారు. ఈ చిత్రంలో తాను రాముడి పాత్రను పోషిస్తున్నానని, రాముడంటేనే ఒక ప్రత్యేకమైన హుందాతనం, భంగిమ ఉంటుందని చెప్పారు. నిలబడే విధానం నుంచి నటన వరకు ప్రతి అంశంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టామని,దానికి రెండు మూడు నెలలు కష్టపడ్డామని తెలిపారు. అంతేకాదు, రాజమౌళి తన పరిగెత్తే స్టైల్‌ను కూడా మార్చారని, దానికోసం ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నానని చెప్పారు.

Advertisement

వివరాలు 

విలన్‌ల పాత్రలు ఇష్టమన్నారు

సినిమాలో కేవలం రెండు షాట్ల కోసమే అంతటి కృషి చేశామని, ఇది రాజమౌళికి సినిమాపై ఉన్న నిబద్ధతకు ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అనేక వర్క్‌షాప్‌లు నిర్వహించారని, యూరోపియన్ శిల్పాలను కూడా అధ్యయనం చేశామని వెల్లడించారు. రాజమౌళి స్క్రిప్ట్ వివరించిన తర్వాత ఆయనకు తాను ఒక మెసేజ్ పంపినట్టు మహేశ్‌బాబు చెప్పారు. 'మీ దర్శకత్వంలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. మీరు కథను చెప్పిన విధానం నన్ను ఆశ్చర్యపరిచింది'అని మెసేజ్ చేశానని తెలిపారు. దానికి రాజమౌళి ఇచ్చిన సమాధానం తనను మరింత ఆకట్టుకుందని అన్నారు.

Advertisement

వివరాలు 

విలన్‌ల పాత్రలు ఇష్టమన్నారు

'నా సినిమాల్లో విలన్ పాత్రలు అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాత్రలను నేను ఎంతో ప్రేమిస్తాను' అని రాజమౌళి రిప్లై ఇచ్చారని చెప్పారు. దానికి తాను కూడా సరదాగా 'నాకూ ప్రతినాయకులంటే ఇష్టమే' అని సమాధానం పంపినట్టు తెలిపారు. ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుందని మహేశ్‌బాబు చెప్పారు. రాజమౌళి సాధారణంగా సాంకేతిక అంశాల గురించి నటీనటులకు ఎక్కువగా వివరించరని, ఆ బాధ్యత మొత్తం ఆయనే తీసుకుంటారని అన్నారు. షూటింగ్ సమయంలో తాము ఒక్కసారి కూడా మానిటర్ చూడలేదని, షాట్ పూర్తయిన వెంటనే తదుపరి సన్నివేశానికి వెళ్లేవాళ్లమని చెప్పారు. రాజమౌళి పనితనం అలాంటిదని, అదే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతోందని మహేశ్‌బాబు తెలిపారు.

Advertisement