LOADING...
33ఏళ్లకు ఆయనతో సినిమా.. నా గుండె ఆనందంతో ఉప్పొంగుతోందన్న తలైవా
నా గుండె ఆనందంతో ఉప్పొంగుతోందన్న తలైవా

33ఏళ్లకు ఆయనతో సినిమా.. నా గుండె ఆనందంతో ఉప్పొంగుతోందన్న తలైవా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 25, 2023
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు. ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి దాదాపు 33 ఏళ్ల తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టారు. ఈ మేరకు ఈ ఇద్దరు కలిసి ఇవాళ షూటింగ్ చేశారు. ఇందులో భాగంగానే తలైవర్ ఆ ఫోటోలను నెట్టింట పంచుకున్నారు. తలైవర్ 170 సినిమా చిత్రీకరణలో రజనీ హీరోగా 'జై భీమ్' ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా తీర్చిదిద్దనున్నారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రజనీ, బచ్చన్ పై సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి. 33 ఏళ్ల తర్వాత గురువు అమితాబ్ బచ్చన్ తో నటిస్తున్నానని, తన మనసు ఆనందంతో ఉప్పొంగుతోందని రజనీకాంత్ తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తలైవర్ 170పై నెట్టింట ట్వీట్ చేసిన రజనీకాంత్