
గేమ్ ఛేంజర్ టైటిల్ తో రామ్ చరణ్ సినిమా: మోషన్ పోస్టర్ లోనే కథ చెప్పేసారు
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్, శంకర్ ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ మేరకు మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ ని రివీల్ చేసారు. ఈ పోస్టర్ లో చూపించిన దాని ప్రకారం, ఇదొక పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది.
మోషన్ పోస్టర్ వీడియో చాలా ఆసక్తికరంగ ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇతర్ ప్రధాన పాత్రల్లో సునీల్, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, అంజలి నటిస్తున్నారు.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీసీ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గేమ్ ఛేంజర్ అంటున్న రామ్ చరణ్
Game Changer it is!!!! https://t.co/VYxWN6p9Hp@shankarshanmugh @SVC_official @advani_kiara @DOP_Tirru @MusicThaman #GameChanger pic.twitter.com/JlY1T1Emjt
— Ram Charan (@AlwaysRamCharan) March 27, 2023