LOADING...
Ram Charan : బుమ్రాకు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్..ట్రోలింగ్ మధ్య స్పందించిన గ్లోబల్ స్టార్
బుమ్రాకు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్..ట్రోలింగ్ మధ్య స్పందించిన గ్లోబల్ స్టార్

Ram Charan : బుమ్రాకు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్..ట్రోలింగ్ మధ్య స్పందించిన గ్లోబల్ స్టార్

వ్రాసిన వారు Moogati Shabari
May 24, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా స్టార్ క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రాకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు. దర్శకుడు బుచ్చిబాబు సనా, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్‌తో కలిసి 'పెద్ది' సినిమా ఆడియో ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ భోపాల్‌కు వెళ్లారు. అక్కడ నిర్వహించిన భారీ మ్యూజికల్ ఈవెంట్‌లో అభిమానుల సందడి మధ్య యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన సమయంలో ఆయన పొరపాటున బుమ్రాను "ఫుట్‌బాల్ ప్లేయర్"గా పేర్కొన్నారు. దీంతో స్టేజ్‌పై ఉన్నవారితో పాటు ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

వివరాలు

వైరల్ అయిన కామెంట్స్..

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రామ్ చరణ్, "నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. ఆయన మన దేశంలో ఫుట్‌బాల్ ఆటను ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు" అని అన్నారు. అయితే ప్రపంచ స్థాయి క్రికెట్ బౌలర్ అయిన బుమ్రాను ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా సంబోధించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు, మీమ్ క్రియేటర్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ సరదా పోస్టులతో సోషల్ మీడియాలో సందడి చేశారు. ఇదిలా ఉండగా, గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "రామ్ చరణ్‌కు పేర్లు, సందర్భాలు గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టమే. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాడు" అని సరదాగా చెప్పిన విషయం మళ్లీ చర్చకు వచ్చింది.

వివరాలు

వెంటనే ట్వీట్ చేసిన రామ్ చరణ్..

తన వ్యాఖ్యలపై ట్రోలింగ్ జరుగుతుండటంతో పాటు జరిగిన పొరపాటును గుర్తించిన రామ్ చరణ్ వెంటనే స్పందించారు. అర్ధరాత్రి తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా బుమ్రాకు క్షమాపణలు తెలియజేశారు. "కొన్నిసార్లు నాకు పేర్లు, విషయాలు గుర్తుండవు. భోపాల్ ఈవెంట్‌లోని భారీ జనసందోహం, అక్కడి ఉత్సాహంలో జరిగిన మానవ తప్పిదం వల్ల అలా మాట్లాడాను. జస్‌ప్రీత్ బుమ్రా గారు, నన్ను క్షమించండి. మీరు నిజంగా ఒక లెజెండ్" అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

వివరాలు

జూన్ 4న విడుదలకు సిద్ధం..

తప్పును అంగీకరించి వెంటనే క్షమాపణ చెప్పిన రామ్ చరణ్ వినయపూర్వక వైఖరిని అభిమానులు ప్రశంసిస్తున్నారు. మెగా అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులు కూడా ఆయన నిజాయితీని మెచ్చుకుంటున్నారు. ఇక జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న 'పెద్ది' సినిమాకు ఈ చిన్న సంఘటన మరింత ప్రచారం తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న రామ్ చరణ్ పోస్ట్ ఇదే..

Advertisement