Page Loader
Ram Charan: పుట్టినరోజున అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్న రామ్ చరణ్! 
పుట్టినరోజున అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్న రామ్ చరణ్!

Ram Charan: పుట్టినరోజున అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్న రామ్ చరణ్! 

వ్రాసిన వారు Stalin
Mar 24, 2024
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌత్ సూపర్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో ఇండస్ట్రీలో విభిన్నమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. మార్చి 27న తన 38వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు 3 సప్రైజ్ లు ఇచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్ పుట్టిన రోజు RC16 సినిమా పేరు, గేమ్ చేంజర్ నుండి పాట, లేదా ఏదైనా కొత్త సినిమా ప్రకటించే అవకాశం ఉంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించి కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. దీని షూటింగ్ కూడా మొదలైంది. జాన్వీ కపూర్‌తో కలిసి 'ఆర్‌సి 16' అని పిలుస్తున్న ఆయన సినిమా పేరును ఆయన పుట్టినరోజున ప్రకటించవచ్చని అంటున్నారు.

Details 

RC 17 కి సంబందించిన అనౌన్స్ మెంట్

ఇది కాకుండా,రామ్ చరణ్,కియారా అద్వానీ చిత్రం 'గేమ్ ఛేంజర్' నుండి మరో సప్రైజ్ ఉండచ్చు. మేకర్స్ అతని పుట్టినరోజున 'గేమ్ ఛేంజర్' నుండి మొదటి పాటను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే,అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అనౌన్స్ మెంట్ లలో RC17 ఒకటి. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉండనుంది. వీరిద్దరూ కలిసి 'రంగస్థలం' సినిమాకి పనిచేశారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC 17 కి సంబందించిన అనౌన్స్ మెంట్ వస్తుందా అంటూ ఫ్యాన్స్ లో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ విధంగా, రామ్ చరణ్ తన పుట్టినరోజున తన అభిమానులకు 3 సప్రైజ్ లు ఇచ్చే అవకాశం ఉంది.