LOADING...
Peddi: 'అబ్బనీ తియ్యనీ దెబ్బ'పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. 'పెద్ది'లో ఉందా లేదా?
'అబ్బనీ తియ్యనీ దెబ్బ'పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. 'పెద్ది'లో ఉందా లేదా?

Peddi: 'అబ్బనీ తియ్యనీ దెబ్బ'పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. 'పెద్ది'లో ఉందా లేదా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2026
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి, శ్రీదేవి నటించిన క్లాసిక్ చిత్రం 'జగదేకవీరుడు అతిలోకసుందరి'లోని సూపర్ హిట్ సాంగ్ 'అబ్బనీ తియ్యనీ దెబ్బ'ను ఈ సినిమాలో రీక్రియేట్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రామ్ చరణ్ స్పష్టత ఇచ్చారు. 'కొన్ని విషయాలు ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పైనే చూసి తెలుసుకోవాలి.

వివరాలు

ఆ పాటను రీక్రియేట్ చేయలేదు

అయితే మేం 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాటను రీక్రియేట్ చేయలేదు. మా ప్రధాన దృష్టి కథపైనే ఉంది. అలాంటి అంశాలను జోడిస్తే సినిమా మరీ కమర్షియల్‌గా మారిపోతుంది. అది ఒక ఐకానిక్ సాంగ్ అని చరణ్ పేర్కొన్నారు. ఇక 'పెద్ది' సినిమా గురించి మాట్లాడిన ఆయన, క్రీడలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని సూచించారు. 'క్రీడలపై పూర్తి దృష్టి పెట్టి వాటికి ప్రాధాన్యం ఇచ్చే వాళ్లకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారు.

వివరాలు

ప్రస్తుత తరం తప్పకుండా చూడాలి

మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్లు కూడా మరింత దృఢంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. జీవితంలో ఎదురయ్యే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమా స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా జీవితం ముందుకు సాగాల్సిందే అనే విషయాన్ని 'పెద్ది' పాత్ర ద్వారా చూపించాం. ప్రస్తుత తరం తప్పకుండా తెలుసుకోవాల్సిన సందేశం ఇందులో ఉందని తెలిపారు.

Advertisement