Page Loader
Ram Charan : రామ్ చరణ్‌తో 'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన సల్మాన్, షారూఖ్, అమీర్ 
Ram Charan : రామ్ చరణ్‌తో 'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన సల్మాన్, షారూఖ్, అమీర్

Ram Charan : రామ్ చరణ్‌తో 'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన సల్మాన్, షారూఖ్, అమీర్ 

వ్రాసిన వారు Stalin
Mar 03, 2024
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్‌లు గుజరా‌త్‌లోని జామ్‍నగర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో సెలబ్రెటీలు సందడి చేస్తున్నారు. బాలీవుడ్ త్రయం షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ 'ఆర్ఆర్ఆర్' 'నాటు నాటు' పాటకు డ్యాన్స్ వేసి.. అదరగొట్టారు. అలాగే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను నీతూ అంబానీ స్టేజిపైకి పిలిచారు. దీంతో ముగ్గురు ఖాన్స్‌తో కలిసి రామ్ చరణ్ నాటు నాటు పాటుకు స్టెప్స్ వేసి అదరగొట్టాడు. అయితే ఖాన్ త్రయం ఒకే వేదికపై డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఖాన్ త్రయంతో రామ్ చరణ్ డ్యాన్స్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'నాటు నాటు' పాటకు డ్యాన్స్ చేస్తున్న ఖాన్ త్రయం