LOADING...
Ram Charan: స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్.. స్క్వేర్ ఇండియా మ్యాగజైన్‌పై మెగా పవర్ స్టార్
స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్.. స్క్వేర్ ఇండియా మ్యాగజైన్‌పై మెగా పవర్ స్టార్

Ram Charan: స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్.. స్క్వేర్ ఇండియా మ్యాగజైన్‌పై మెగా పవర్ స్టార్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 17, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ తన ఫ్యాషన్ స్టైల్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. హాంకాంగ్‌లోని ప్రసిద్ధ విక్టోరియా హార్బర్ వద్ద నిర్వహించిన ప్రత్యేక ఫోటోషూట్‌లో ఆయన కనిపించిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రముఖ మ్యాగజైన్ 'ఎస్క్వైర్ ఇండియా' ఏప్రిల్ సంచిక కవర్ కోసం చేసిన ఈ షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరలవుతోంది. తెల్లటి సూట్‌లో సొగసుగా మెరిసిన రామ్ చరణ్ తన అంతర్జాతీయ ఇమేజ్‌తో మరింత ఎత్తుకెళ్లారు.

వివరాలు

హాంకాంగ్ వీధుల్లో అదిరిపోయే స్టైల్..

మెగాస్టార్ వారసుడిగా సినీ రంగంలోకి వచ్చిన రామ్ చరణ్, తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపును సంపాదించి, ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తిగా ఎదిగారు. హాంకాంగ్ స్కైలైన్ మధ్య విక్టోరియా హార్బర్ వద్ద ఓ నౌకపై నిలబడి తీసిన ఆయన ఫోటోలు ఎంతో హుందాగా కనిపిస్తున్నాయి. తెల్లటి సూట్‌లో ఆయన స్టైల్ మ్యాగజైన్ కవర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయన వ్యక్తిత్వంలో గాంభీర్యం, అంతర్జాతీయ స్టార్ ఇమేజ్ రెండూ స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.

వివరాలు

మ్యాగజైన్ కవర్‌పై మెరిశాడిలా.. 

ఎస్క్వైర్ ఇండియా తన ఎక్స్ (ట్విట్టర్) వేదికలో ఈ ఫోటోలను పంచుకున్న వెంటనే అవి వేగంగా వైరల్ అయ్యాయి. తెల్లటి దుస్తులతో పాటు గోధుమ రంగు సూట్‌లో ఉన్న మరికొన్ని ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. హాంకాంగ్ అందాల మధ్య రామ్ చరణ్ స్టైలిష్ ప్రదర్శన అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో #రామ్ చరణ్, #ఎస్క్వైర్ ఇండియా వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement