Buchi Babu Sana: రామ్ చరణ్ కు గాయం.. చిరంజీవి కాల్‌పై బుచ్చిబాబు ఎమోషనల్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు షూటింగ్ సమయంలో జరిగిన ఓ భయానక సంఘటనను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమాలోని కీలక సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ కంటికి అనుకోకుండా గాయం అయ్యిందని బుచ్చిబాబు తెలిపారు. ఆ ఘటనలో చరణ్ కంటి నుంచి రక్తం కారిందని, అది కెమెరాలో కూడా రికార్డు అయిందని చెప్పారు.
వివరాలు
విషయం తెలిసిన వెంటనే ఫోన్ చేశారు
రామ్ చరణ్ రక్తంతో కనిపించిన క్షణం తనకు తీవ్ర భయం వేసిందని, ఒక్కసారిగా చేతులు కాళ్లు ఆడనట్లయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను కలిగి ఉన్న గ్లోబల్ స్టార్ తన సెట్స్‌లో గాయపడటంతో తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని బుచ్చిబాబు వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారని, ఆ సమయంలో తనలో మరింత టెన్షన్ పెరిగిందని చెప్పారు. చరణ్‌కు గాయం కావడంపై చిరంజీవి తనను మందలిస్తారేమోనని భావించినట్లు తెలిపారు. అయితే ఫోన్‌లో చిరంజీవి స్పందించిన తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందని బుచ్చిబాబు అన్నారు.
వివరాలు
చిరంజీవి ఎంతో ప్రశాంతంగా మాట్లాడారు
కోపం వ్యక్తం చేయకుండా, అసలు ఏం జరిగిందో ప్రశాంతంగా అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అంతేకాకుండా, గాయం జరిగిన వీడియో క్లిప్‌ను తనకు పంపించాలని చిరంజీవి కోరినట్లు వెల్లడించారు. "కంగారు పడకు బుచ్చి... ఏం జరిగిందో వీడియో పంపించు" అంటూ చిరంజీవి ఎంతో ప్రశాంతంగా మాట్లాడారని, ఆయన చూపించిన మెచ్యూరిటీ, అండదండలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని బుచ్చిబాబు తెలిపారు. ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.