Peddi: రామ్ చరణ్ మాస్ సాంగ్ లీక్.. పెద్ది టీంలో ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ రోజూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, రామ్ చరణ్ ఊర మాస్ లుక్ ఈ ప్రాజెక్టుపై అంచనాలను మరింత పెంచింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ లీక్ నెట్టింట వైరల్‌గా మారింది. భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సెట్స్ నుంచి ఫోటోలు లేదా వీడియోలు లీక్ కావడం సాధారణమే. ఇప్పుడు 'పెద్ది' కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది.
వివరాలు
స్పెషల్ సాంగ్ లో శ్రుతిహాసన్
ఈ చిత్రంలోని ఒక పవర్‌ఫుల్ మాస్ బీట్ సాంగ్‌కు సంబంధించిన చిన్న వీడియో బయటకు వచ్చింది. ఈ పాట సినిమాలో ప్రత్యేక ఐటమ్ సాంగ్‌గా ఉంటుందని, అదే సినిమాకు హైలెట్ అవుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ పలువురు స్టార్ హీరోయిన్లను సంప్రదించినప్పటికీ, చివరకు శ్రుతి హాసన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతుండగా, రామ్ చరణ్ - శృతి హాసన్ రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ఎవరో టాప్ యాంగిల్ నుంచి మొబైల్‌లో సీక్రెట్‌గా వీడియో తీసి లీక్ చేశారు. కేవలం కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
వివరాలు
హీరోయిన్ గా జాన్వీ కపూర్
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్, చికిరి, రాయ్ రాయ్ రా రా, పహిల్వాన్ వంటి వీడియోలు సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. రెహమాన్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న 'పెద్ది' ఈ ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.
వివరాలు
అభిమానుల్లో భారీ అంచనాలు
గతంలో 'ఉప్పెన'తో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు, ఈసారి రామ్ చరణ్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో తెలుసుకోవాలంటే జూన్ వరకు వేచి చూడాల్సిందే.