Page Loader
Game Changer : 'రా మచ్ఛా మచ్చా' పోస్టర్‌తో రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. కానీ విడుదల తేదీపై సస్పెన్స్!
'రా మచ్ఛా మచ్చా' పోస్టర్‌తో రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. కానీ విడుదల తేదీపై సస్పెన్స్!

Game Changer : 'రా మచ్ఛా మచ్చా' పోస్టర్‌తో రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. కానీ విడుదల తేదీపై సస్పెన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2024
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి పలు వాయిదాలు పడుతుండటంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌ సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ నటిస్తుండగా, తమిళ నటుడు ఎస్‌.జె. సూర్య విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌, అంజలి, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమ హీరో సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా మేకర్స్‌ తాజాగా "రా మచ్ఛా మచ్చా" అనే సెకండ్‌ సింగిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

Details

డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ రిలీజ్

అయితే విడుదల తేదీని మాత్రం వెల్లడించకపోవడంతో ఫ్యాన్స్‌ నిరుత్సాహానికి గురయ్యారు. 'తేదీ లేకుండా పోస్టర్‌ ఏమిటి?' అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల అవుతుందని సంగీత దర్శకుడు తమన్‌ ట్వీట్ చేశారు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్‌ చరణ్‌ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఒకటి ఐఎఎస్ అధికారిగా, మరొకటి రాజకీయనాయకుడిగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం శంకర్‌ ఈ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్‌ కోసం లాస్‌ ఏంజెల్స్‌లో ఉన్నారు.