Page Loader
రామ్ చరణ్ కూతురు బారసాల కోసం అంబానీ పంపిన బంగారు ఊయల: క్లారిటీ ఇచ్చిన టీమ్ 
బంగారు ఊయలపై క్లారిటీ ఇచ్చి టీమ్

రామ్ చరణ్ కూతురు బారసాల కోసం అంబానీ పంపిన బంగారు ఊయల: క్లారిటీ ఇచ్చిన టీమ్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 30, 2023
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20వ తేదీన తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. మెగా కుటుంబానికి వారసురాలు రావడంతో అభిమానులంతా మెగా ప్రిన్సెస్ వచ్చేసిందని ముద్దుగా పిలుస్తున్నారు. వారసురాలి రాకతో మెగా కుటుంబం సంబరాల్లో ఉంది. ఈరోజు మెగా ప్రిన్సెస్ బారసాల జరగబోతుంది. ఉపాసన తల్లి ఇంట్లో ఈ వేడుక జరుగుతుంది. అయితే బారసాల గురించి న్యూస్ వచ్చినప్పటి నుండి బంగారు ఊయల టాపిక్ వైరల్ గా మారింది. రామ్ చరణ్, ఉపాసన దంపతుల బిడ్డకు అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, బంగారు ఊయలను బహుమతిగా పంపారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ విషయమై రామ్ చరణ్ టీమ్ స్పందించింది.

Details

చెక్క ఊయలలో మెగా ప్రిన్సెస్ 

పాప బారసాల ఫంక్షన్ రోజు బంగారు ఊయల కాకుండా చెక్క ఊయల లోనే వేస్తున్నారని, ప్రజ్వల ఫౌండేషన్ వారు తయారు చేసిన చెక్క ఊయలలో పాపను వేస్తున్నట్లు రామ్ చరణ్ టీమ్ వెల్లడి చేసింది. ఈ చెక్క ఊయలను తయారు చేయడానికి ఎలాంటి మెషిన్ ఉపయోగించలేదని, కేవలం చేతులతో మాత్రమే తయారు చేసారని రామ్ చరణ్ టీమ్ స్పష్టం చేసింది. అదలా ఉంచితే ప్రస్తుతం మెగా కుటుంబం అంతా మొయినాబాద్ లోని ఉపాసన తల్లి ఇంటికి చేరుకుంటున్నారు. ఈరోజు పాపకు పేరు పెట్టనున్నారు. పేరు పెట్టిన తర్వాత మీడియాకు తెలియజేస్తానని ఉపాసన డిశ్చార్జి సమయంలో రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.